SACHIN: నేషనల్‌ ఐకాన్‌గా సచిన్‌

SACHIN: నేషనల్‌ ఐకాన్‌గా సచిన్‌
సచిన్‌కు నేషనల్‌ ఐకాన్‌ గుర్తింపు ఇవ్వనున్న ఎన్నికల సంఘం... ఓటుకు ఉన్న విలువను తెలియజేయనున్న సచిన్‌

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో( especially in General Elections 2024) టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌(Sachin Tendulkar) కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. భారత ఎన్నికల సంఘం( Election Commission) సచిన్‌ను నేషనల్‌ ఐకాన్‌( national icon)గా గుర్తింపు ఇవ్వనుంది. దీనికి సంబంధించి నేడు ఒప్పందం జరుగనుండగా మూడేళ్ల పాటు సచిన్‌ నేషనల్‌ ఐకాన్‌గా ఉండనున్నారు. ఓటుకు ఉన్న విలువను తెలియజేస్తూ దేశవ్యాప్తంగా ఓటర్లలో అవగాహన కల్పించే కార్యక్రమాల్లో క్రికెట్‌ గాడ్‌( voter awareness ambassador) భాగం కానున్నారు.


అంతర్జాతీయ క్రికెట్‌లో వంద సెంచరీలు చేసిన సచిన్‌ టెండుల్కర్‌కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. యువతలోనూ సచిన్‌కు మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ క్రికెట్‌ గాడ్‌ క్రేజ్‌ను ఉపయోగించి ఓటర్లను మరింత చైతన్యవంతం చేసేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈ లెజండరీ క్రికెటర్‌ను నేషనల్‌ ఐకాన్‌గా నియమించనుంది. గతంలో బాలీవుడ్‌ నటులు పంకజ్‌ త్రిపాఠి, ఆమిర్‌ ఖాన్‌, టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని, బాక్సర్‌ మేరీ కోమ్‌ లోక్‌సభ ఎన్నికల సమయంలో నేషనల్‌ ఐకాన్లుగా సేవలు అందించారు.

Tags

Read MoreRead Less
Next Story