SAD: ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకున్న ప్రియురాలు

SAD: ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకున్న ప్రియురాలు
X
మహారాష్ట్రలో పరువు హత్య కలకలం... 25 ఏళ్ల దళిత యువకుడు సక్షమ్ హత్య... అంత్యక్రియల రోజు యువతి సంచలనం

మహా­రా­ష్ట్ర­లో జరి­గిన ఓ పరు­వు హత్య వ్య­వ­హా­రం హృ­ద­య­వి­దా­ర­కం­గా ము­గి­సిం­ది. మహా­రా­ష్ట్ర­లో­ని నాం­దే­డ్ జి­ల్లా ఓల్డ్ గంజ్ ప్రాం­తా­ని­కి చెం­దిన 25 ఏళ్ల దళిత యు­వ­కు­డు సక్ష­మ్, ఆం­చ­ల్ అనే యు­వ­తి ప్రే­మిం­చు­కు­న్నా­రు. అయి­తే వీరి ప్రేమ వ్య­వ­హా­రం ఇం­ట్లో తె­లి­య­డం­తో.. కు­లా­లు వేరు కా­వ­డం­తో పరు­వు పో­తుం­ద­ని భా­విం­చిన ఆం­చ­ల్ తం­డ్రి, సో­ద­రు­డు మరో ము­గ్గు­రు బం­ధు­వు­ల­తో కలి­సి నవం­బ­ర్ 27న సక్ష­మ్‌­ను దా­రు­ణం­గా కొ­ట్టా­రు. తీ­వ్రం­గా గా­య­ప­డిన సక్ష­మ్‌­ను కు­టుంబ సభ్యు­లు ఆసు­ప­త్రి­కి తీ­సు­కె­ళ్తుం­డ­గా­నే ప్రా­ణా­లు వి­డి­చా­డు. అయి­తే సక్ష­మ్‌ అం­త్య­క్రి­యల రోజు ఆ యు­వ­తి సం­చ­లన ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. "అతడు జీ­విం­చి ఉన్నా, చని­పో­యి­నా నా భర్తే" అంటూ మృ­త­దే­హా­ని­కి కుం­కుమ రాసి, మం­గ­ళ­సూ­త్రం ధరిం­చి, సిం­ధూ­రం పూ­సు­కు­ని వి­వా­హం చే­సు­కుం­ది. ఆ తర్వాత సక్ష­మ్ తల్లి­దం­డ్రుల దగ్గ­ర­కు వె­ళ్లి, వారి కో­డ­లి­గా ఇక్క­డే ఉం­టా­న­ని ప్ర­క­టిం­చిం­ది. సక్ష­మ్ తల్లి ఆం­చ­ల్‌­ను కూ­తు­రి­లా ఆలిం­గ­నం చే­సు­కు­ని ఆద­రిం­చా­రు. ఐదు­గు­రు నిం­ది­తు­ల­ను అరె­స్ట్ చేసి కేసు నమో­దు చే­శా­రు. తమకు నాకు న్యా­యం కా­వా­ల­ని, హం­త­కు­ల­కు ఉరి­శి­క్ష పడా­లి, అప్పు­డే తన భర్త ఆత్మ శాం­తి­స్తుం­ద­ని ఆ యు­వ­తి అధి­కా­రు­ల­ను కో­రిం­ది.

అసలేం జరిగిందంటే..?

స్థా­నిక జు­నా­గం­జ్‌ ప్రాం­తా­ని­కి చెం­దిన సక్షం టే­ట్‌, ఆం­చ­ల్‌ మా­మి­డి­వా­ర్‌ ప్రే­మిం­చు­కు­న్నా­రు. ఇటీ­వల ఆం­చ­ల్‌ కు­టుం­బా­ని­కి ప్రేమ వ్య­వ­హా­రం తె­లి­సిం­ది. ఇరు­వు­రి కు­లా­లు వే­ర్వే­రు అని, తన సో­ద­రి­తో మా­ట్లా­డ­వ­ద్ద­ని ఆం­చ­ల్‌ సో­ద­రు­డు.. సక్షం టే­ట్‌­ను హె­చ్చ­రిం­చా­రు. తర్వాత అత­డి­ని హత్య చే­యా­ల­ని ని­ర్ణ­యిం­చు­కు­న్నా­రు. గు­రు­వా­రం ఆం­చ­ల్‌ తం­డ్రి గజా­న­న్‌, సో­ద­రు­లు సా­హి­ల్‌, హి­మే­ష్‌, తమ ఇద్ద­రు స్నే­హి­తు­ల­తో కలి­సి సక్షం టే­ట్‌­ను హత్య చే­శా­రు. అయి­తే ప్రి­యు­డి­ని చంపి తన తం­డ్రి, సో­ద­రు­లు గె­లి­చా­మ­ని భా­వి­స్తు­న్నా­ర­ని, చని­పో­యి­నా, బతి­కు­న్నా అతడే తన భర్త­ని పే­ర్కొ­న్న ఆం­చ­ల్‌.. సక్షం టే­ట్‌ మృ­త­దే­హా­న్ని వి­వా­హ­మా­డిం­ది. ఇక నుం­చి అతని ఇల్లే తన ఇల్ల­ని, అక్క­డే ఉం­టా­న­ని తె­లి­పిం­ది.

Tags

Next Story