Udayanidhi Stalin: సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు..

సనాతన ధర్మం దోమ లాంటిదని, అదే అనేక సామాజిక రుగ్మతలకు కారణమతోందంటూ తమిళనాడు మంత్రి, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ భారీ కాంట్రవర్సీకి తెరతీశారు. సామాజిక న్యాయానికి పూర్తిగా వ్యతిరేకమైన సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. భారత్‌లో నరమేధానికి ఉదయనిధి పిలుపునిచ్చారని ఆరోపిస్తున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కొడుకు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం సామాజిక న్యాయానికి విరుద్ధమని, దానిని నిర్మూలించాలన్నారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా లాంటది, దీన్ని నిర్మూలించాలని అన్నారు. చెన్నైలో జరిగిన రచయితల సదస్సులో ఉదయనిధి ఈ వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం అనే ఆలోచన తిరోగమనమైందని, దీన్ని వ్యతిరేకించడం సాధ్యం కాదని, నిర్మూలించడమే పరిష్కారం అని అన్నారు. ఇది సమాజాన్ని కులం, స్రీ-పురుష బేధాలతో విభజిస్తుందని, సమానత్వం, సామాజిక న్యాయం వంటి వాటికి ప్రాథమికంగా వ్యతిరేకమని అన్నారు.
అయితే ఈ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. బీజేపీ పార్టీ ఉదయనిధి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది.డీఎంకే పార్టీ వారసుడిగా పేరు సంపాదించుకున్న ఉదయనిధి స్టాలిన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై బీజేపీ ఘాటుగానే స్పందిస్తోంది. ‘డీఎంకే వారసుడు సనాతన ధర్మాన్ని రూపుమాపడం గురించి మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ మౌనమే ఈ జాతి విధ్వంసక పిలుపుకు మద్దతు ఇస్తోందని, పేరుకు తగ్గట్లే ఇండియా కూటమికి అవకాశం ఇస్తే వేల ఏళ్ల నాగరితకను నిర్మూలిస్తుందని’ బీజేపీ నేత అమిత్ మాల్వియా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. తాను మాట్లాడిన ప్రతీ మాటకు కట్టుబడి ఉంటానని ఉదయనిధి సమర్థించుకున్నారు. తన అభిప్రాయంపై తాను వెనక్కు తగ్గేదే లేదని స్పష్టం చేశారు. సనాతన ధర్మం సమాజంపై ప్రతికూలం ప్రభావంపై అంబేద్కర్, పెరియార్ చేసిన రచనల్ని ఏ వేదికలోనైనా ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఈ మేరకు తన ప్రసంగాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. న్యాయస్థానంలో, ప్రజాకోర్టులో ఎదరయ్యే సవాళ్లను ఎదుర్కొవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అయితే క్రైస్తవ మిషనరీల ఆలోచనలను ఉదయనిధి స్టాలిన్, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌లు చెబుతున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై విమర్శించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com