Yogi Adityanath: కుంభమేళా జాతీయ ఐక్యతకు ప్రతీక..సీఎం యోగి

ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న ‘‘మహా కుంభమేళా’’ భారీ మతరపరమైన కార్యక్రమం, ఇది ఏ ఒక్క కులం, మతానికి ఉద్దేశించబడలేదని, ఇది అన్ని మతాలు, సంస్కృతులకు, ప్రతీకగా నిలుస్తుందని ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘సనాతన ధర్మ జాతీయ మతం’’ అని అన్నారు. ‘‘సనాతన ధర్మం జాతీయ మతం, ఇది మానవత్వం యొక్క మతం, ఆరాధించే ప్రక్రియ భిన్నంగా ఉండొచ్చ కానీ మతం ఒకటే. కుంభమేళా సనాతన ధర్మానికి ప్రతినిధి’’ అని ఆయన అన్నారు.
ఈ ఐక్యత సందేవాన్ని మహా కుంభమేలా అందించిందని, కుంభమేళాలో ఎలాంటి వివక్ష లేదని, దృతరాష్ట్రుడిగా ఉండకుండా, సనాతన ధర్మాన్ని విమర్శించే వారు కుంభమేళాని చూడాలని ఆయన అన్నారు. ప్రయాగ్ రాజ్ వద్ద గంగా, యమునా, సరస్వతి నదుల సంగమ ప్రదేశంలో కుంభమేళా జరుగుతోంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఈ అపూర్వ జనసమాగమం జరగనుంది. ఇప్పటికే సంగమ ప్రదేశంలో 10 కోట్ల మంది భక్తులు స్నానమాచరించారు. కుంభమేళాతో దేశవిదేశాల నుంచి వచ్చే భక్తుల సంఖ్య 45 కోట్లు ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com