Patra Chawl: భారీ కుంభకోణం కేసులో ఎంపీతో పాటు భార్యకు ఈడీ సమన్లు..

Patra Chawl: భారీ కుంభకోణం కేసులో ఎంపీతో పాటు భార్యకు ఈడీ సమన్లు..
X
Patra Chawl: పత్రా ‘చాల్’ కుంభకోణం కేసులో శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌కు PMLA కోర్టులో షాక్‌ తగిలింది.

Patra Chawl: పత్రా 'చాల్' కుంభకోణం కేసులో శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌కు PMLA కోర్టులో షాక్‌ తగిలింది. సంజయ్‌ రౌత్‌ ఈడీ కస్టడీని న్యాయస్ధానం ఆగస్ట్‌ 8 వరకు పొడిగించింది. అయితే పత్రాచల్‌ స్కాంలో జులై 31న సంజయ్‌రౌత్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. పత్రా 'చాల్' కేసులో అరెస్టయిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్‌కు కూడా ఈడీ సమన్లు ​జారీ చేసింది. శుక్రవారం విచారణకు పిలిచింది. వర్షా రౌత్ ఖాతాలో లావాదేవీ జరిగిన తర్వాత సమన్లు జారీ చేసినట్లు ఈడీ తెలిపింది. గోరేగావ్‌లోని పత్రా 'చాల్లే' రీ డెవలప్‌మెంట్‌లో ఆర్థిక అవకతవకలు, అతని భార్య ఆస్తికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి రౌత్‌ను ఆదివారం ED అరెస్టు చేసింది. సంజయ్ రౌత్‌ను ఈరోజు ముంబైలోని కోర్టులో హాజరుపరిచారు.

Tags

Next Story