Saurath Sabha: మోడర్న్ స్వయంవరం.. ఇక్కడ పెళ్లికొడుకును కొనుక్కోవచ్చు..

Saurath Sabha: స్వయంవరం అనే కాన్సెప్ట్ పురాణాల్లో, రాజుల కాలంలోనే కనుమరుగయిపోయాయి. కానీ ఈరోజుల్లో కూడా స్వయంవరం లాంటివి ఉంటే బాగుండు అనుకునే వారు చాలామందే ఉంటారు. బీహార్‌లోని మధుబని జిల్లాలో స్వయంవరాలు ఇంకా జరుగుతున్నాయి. కానీ కాస్త భిన్నంగా.. ఈ ఆచారాన్ని వారు గత 700 ఏళ్లగా పాటిస్తున్నట్టుగా స్థానికులు చెప్తున్నారు.
అమ్మాయే తనకు కావాల్సిన వరుడిని సెలక్ట్ చేసుకోవడం అనేది మామూలుగా జరిగేదే. కానీ పెళ్లి కాని అబ్బాయిలు అందరూ ఒకేచోట ఉండగా.. వారిలో తనకు ఎవరు నచ్చితే వారిని కొనుక్కొని పెళ్లి చేసుకోవడం అనేది కాస్త డిఫరెంట్ కదా. బీహార్ మధుబనిలో జరిగేది అదే. దీన్నే వారు సౌరత్ సభా అని పిలుస్తారు. దీంట్లో మైతిల్ బ్రాహ్మిన్ సమాజానికి చెందిన వారు పాల్గొంటారు.
సౌరత్ సభాలో పెళ్లి కాని అబ్బాయిలు ఒకేచోట కనిపిస్తారు. ఇక వారి సంపాదన, ఆస్తి వివరాలను బహిరంగంగానే చెప్తారు. అక్కడికి వచ్చిన అమ్మాయిలు.. అబ్బాయి నచ్చితే ఇరువురి కుటుంబ సభ్యులు తరువాతి కార్యక్రమాలను చూసుకుంటారు. ఏడాదికి ఎన్నో వేలమందిని ఒక్కటి చేసింది ఈ సౌతర్ సభా. రాజా హరిసింగ్ దీనిని ప్రారంభించారని, కర్నాత్ వంశపాలన కాలం నుండి ఇది జరుగుతుందని స్థానికులు వివరించారు.
Groom market'
— Elmi Farah Boodhari (@BoodhariFarah) August 4, 2022
In this unique 700-year-old tradition, the aspiring husbands stand in public display,
Village famous for its " annual "groom market" in India's Bihar state -in Madhubani district
Dowry though illegal in India, is prevalent and has a high social acceptance pic.twitter.com/G5428fE2Kz
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com