Savitri Jindal : మన దేశంతో పాటు ఆసియా దేశాల్లో ఈవిడే ధనవంతురాలు..

Savithri Jindal : సావిత్రి జిందాల్ ఇప్పుడు ఆశియాలోనే అత్యంత ధనిక మహిళగా మొదటి స్థానంలో నిలిచారు. జిందాల్ గ్రూప్ చైర్మన్ ఓపీ జిందాల్ భార్యే సావిత్రి జిందాల్. 2005లో ఓపీ జిందాల్ విమన ప్రమాదంలో చనిపోయినప్పుడు ఆమె కంపెనీ బాద్యతలను స్వీకరించారు. చైనాను సైతం అధిగమించి భారత మహిళ అత్యంత ధనికురాలిగా స్థానం సంపాదించారు.
కొంత కాలం క్రితం వరకు చైనాకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ కో చైర్మన్ యాంగ్ హుయన్ ఆశియాలోనే అత్యంత ధనికురాలిగా మొదటి స్థానంలో ఉన్నారు. అయితే ఇటీవళ చైనాలో రియల్ ఎస్టేట్ సంక్షోభంతో మొత్తం కుదేలయిపోయింది. దీంతో ఆమె సంపద విలువ కూడా 23.7 బిలయన్ డాలర్ల నుంచి 11 బిలియన్లకు పడిపోయింది. ఇప్పుడీమె మూడవ స్థానంలో ఉన్నారు.
సావిత్రి జిందాల్.. 11.3 బిలియన్ డాలర్ల సంపదతో ఆశియా ధనిక మహిళగా మొదటి స్థానంలో ఉన్నారు. రెండవ స్థానంలో చైనాకు చెందిన టైకూన్ ఫాన్ హాంగివియ్ ఉన్నారు. rఇక జిందాల్ సంస్థ దేశంలోనే మూడవ అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా ఉంది. స్టీల్‌తో పాటు సిమెంట్, ఎనర్జీ కూడా ఉత్పత్తి చేస్తుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com