Supreme Court: మణిపుర్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

మణిపుర్ హింసాత్మాక ఘటనలపై (Manipur Violence) సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. మణిపుర్ హింస(Manipur violence case)పై దర్యాప్తు కోసం ముగ్గురు మాజీ మహిళా హైకోర్టు జడ్జీల(committee of 3 former women judges)తో అత్యున్నత కమిటీని నియమించింది. కేసుల విచారణతో పాటు బాధితుల సహాయ, పునరావాస పర్యవేక్షణకు ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ముగ్గురు సభ్యుల కమిటీలో జమ్ముకశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్(Justices Gita Mittal), ముంబై హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ షాలిని జోషి( Justice Shalini Phansalkar Joshi) , ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆశా మీనన్(Justice Asha Menon )లు ఉంటారని వెల్లడించింది.
చట్టపాలనపై విశ్వసనీయతను పునరుద్ధరించేందుకే ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం తెలిపింది. చట్ట పాలనపై విశ్వాసాన్ని పునరుద్ధరించడం కోసమే తమ ప్రయత్నాలన్న సుప్రీంకోర్టు... మహిళ మాజీ జడ్జీల కమిటీ సహాయక చర్యలను, నివారణ చర్యలు మొదలైనవాటిని కూడా పరిశీలిస్తుందని CJI జస్టిస్ డీవైచంద్రచూడ్ (Chief Justice of India (CJI) D.Y. Chandrachud)ప్రకటించారు.
మణిపూర్ హింసపై సీబీఐ విచారణను మాజీ ఐపీఎస్ అధికారి దత్తాత్రేయ పడ్‌సాలగీకర్( Mr.Dattatray Padsalgikar IPS) పర్వవేక్షిస్తారని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. వివిధ రాష్ట్రాలకు చెందిన కనీసం ఐదుగురు డిప్యూటీ ఎస్పీ స్థాయి అధికారులు సీబీఐలో ఉంటారని పేర్కొంది. అంతేకాకుండా వివిధ రాష్ట్రాల నుంచి డీజీఐ ర్యాంక్ అధికారులతో కూడిన 42 సిట్‌లు( 42 SITs to investigate the cases) ఏర్పాటు చేసింది. సీబీఐయేతర కేసుల విచారణను ఈ 42 సిట్‌లు విచారిస్తాయని, ఒక్కో అధికారి ఆరు సిట్‌లను పర్యవేక్షిస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది. విచారణ సజావుగా సాగేందుకు ఈ చర్యలు ఉపకరిస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది.
మణిపుర్ డీజీపీ రాజీవ్‌సింగ్ వ్యక్తిగతంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు హాజరయ్యారు. మణిపూర్ హింస, నివారణకు తీసుకున్న చర్యలపై సుప్రీంకోర్టుకు ఆయన వివరించారు. మణిపుర్‌లో చెలరేగిన హింసాత్మక ఘటనలపై దర్యాప్తు జరిపేందుకు ఆయా జిల్లా ఎస్పీల నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేటీవ్ టీమ్-సిట్‌లను ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రాజీవ్ సింగ్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఎఫ్‌ఐఆర్‌ల వ్యవహారం తప్పుల తడకగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం.. ఆయన్ని హాజరు కావాలంటూ ఆదేశించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com