SC: వీధికుక్కల అంశంపై సుప్రీం ఆదేశాల సవరణ

SC: వీధికుక్కల  అంశంపై సుప్రీం ఆదేశాల సవరణ
X
హాని చేసే లేదా క్రూరంగా ఉండే కుక్కలను మాత్రమే షెల్టర్లకు తరలించాలని ధర్మాసనం స్పష్టం

వీధి కుక్కల తరలింపు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు వెలువరించింది. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో మొత్తం వీధి కుక్కలను తొలగించి షెల్టర్లకు తరలించాలని జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్టు శుక్రవారం సవరించింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వి. అంజరియాతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. హాని చేసే లేదా క్రూరంగా ఉండే కుక్కలను మాత్రమే షెల్టర్లకు తరలించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే వీధి కుక్కలకు ఆహారం పెట్టడం, మళ్ళీ వాటిని వొదిలేయడం, దత్తత తీసుకోవడం వంటి విషయాలపై కూడా మార్గదర్శకాలను సుప్రీంకోర్టు సూచించింది.

వీ­ధు­లు లేదా బహి­రంగ ప్ర­దే­శా­ల్లో కు­క్క­ల­కు ఆహా­రం అం­దిం­చ­డం చట్ట­వి­రు­ద్ధ­మ­ని సు­ప్రీం­కో­ర్టు స్ప­ష్టం చే­సిం­ది. వీధి కు­క్క­ల­కు ని­ర్దే­శిత ప్రాం­తా­ల్లో­నే ఆహా­రం అం­దిం­చా­ల­ని, ఇం­దు­కో­సం ప్ర­తి వా­ర్డు­లో ప్ర­త్యేక కేం­ద్రా­ల­ను ఏర్పా­టు చే­యా­ల­ని పే­ర్కొం­ది. ఆ ప్రాం­తా­ల్లో మా­త్ర­మే ఆహా­రం అం­దిం­చా­ల­ని సూ­చి­స్తూ నో­టీ­సు బో­ర్డు­లు ఏర్పా­టు చే­యా­ల­ని వె­ల్ల­డిం­చిం­ది. ఎట్టి పరి­స్థి­తు­ల్లో­నూ వీ­ధు­ల్లో కు­క్క­ల­కు ఆహా­రం ఇవ్వ­కూ­డ­ద­ని, ఈ ఆదే­శా­ల­ను ఎవ­రై­నా ఉల్లం­ఘి­స్తే చట్ట ప్ర­కా­రం చర్య­లు ఉం­టా­య­ని హె­చ్చ­రిం­చిం­ది. ని­యం­త్రణ లే­కుం­డా ఆహా­రం ఇవ్వ­డం వల్ల అవాం­ఛ­నీయ ఘట­న­లు చో­టు­చే­సు­కుం­టు­న్నా­య­ని వచ్చిన ని­వే­ది­క­ల­ను పరి­గ­ణ­న­లో­కి తీ­సు­కొ­ని ఈ ఆదే­శా­లు జారీ చే­స్తు­న్న­ట్లు చె­ప్పిం­ది. సా­మా­న్య పౌ­రు­లు వీ­ధు­ల్లో నడి­చే­ట­ప్పు­డు ఇబ్బం­దు­లు ఎదు­ర్కొం­టు­న్నా­ర­ని, ఇలాం­టి పద్ధ­తి­కి స్వ­స్తి పల­కా­ల­ని అభి­ప్రా­య­ప­డిం­ది. వీధి కు­క్కల వ్య­వ­హా­రం­లో అధి­కా­రు­లు ని­ర్ల­క్ష్యం చే­స్తే ప్ర­జ­లు ఫి­ర్యా­దు చే­య­గ­లి­గే­లా హె­ల్ప్‌­లై­న్ నెం­బ­ర్ ప్రా­రం­భిం­చా­ల­ని ఆదే­శిం­చిం­ది.

టీకాలు వేసిన లేదా స్టెరిలైజేషన్ చేసిన కుక్కలను తిరిగి వాటి ప్రదేశాలలో విడుదల చేయాలని సూచించింది. జంతు ప్రేమికులు డాగ్ షెల్టర్లలోని కుక్కలను దత్తత తీసుకోవచ్చని.. దీనికి ఇందుకు ప్రభుత్వ అధికారులు సహకరించాలని పేర్కొంది. జంతు జనన నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా కుక్కలను తరలించే మున్సిపల్ అధికారుల చర్యలను ఎవరూ అడ్డుకోవద్దని ధర్మాసనం సూచించింది. ఈనెల 11న ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఢిల్లీలో కొత్త డాగ్ షెల్టర్లు, పౌండ్లను ఏర్పాటు చేయాలని కోర్టు మున్సిపల్ సంస్థలను ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ ఎనిమిది వారాల తర్వాత ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది.

రాజకీయ పార్టీల తీరుపై సుప్రీం ఆశ్చర్యం

బి­హా­ర్‌­లో ఓటరు జా­బి­తాల ప్ర­త్యేక ము­మ్మర సవరణ (ఎస్‌­ఐ­ఆ­ర్‌) వి­వా­దం­పై సు­ప్రీం­కో­ర్టు వి­చా­రణ చే­ప­ట్టిం­ది. డి­లీ­ట్‌ చే­సిన ఓట­ర్‌ పే­ర్ల­ను సరి­ది­ద్దే వి­ష­యం­లో రా­జ­కీయ పా­ర్టీ­లు అచే­త­నం­గా ఉం­డ­టం­పై ధర్మా­స­నం ఆశ్చ­ర్యం వ్య­క్తం చే­సిం­ది. రా­జ­కీయ పా­ర్టీ­లు చొ­ర­వ­తో ముం­దు­కు రా­వా­ల­ని కో­రిం­ది. అదే సమ­యం­లో ఎస్‌­ఐ­ఆ­ర్‌ ప్ర­క్రియ ఓట­ర్‌ ఫ్రెం­డ్లీ­గా ఉం­డా­ల­ని పు­న­రు­ద్ఘా­టిం­చిం­ది. 'డి­లీ­ట్‌ చే­సిన పే­ర్ల వి­ష­యం­లో ఆధా­ర్‌ కా­ర్డు లేదా.. ఏదై­నా ఆమో­ద­యో­గ్య పత్రం­తో పాటు చేసే ఆన్‌­లై­న్‌ సబ్మి­ష­న్ల­ను అను­మ­తి­స్తాం.' అని ధర్మా­స­నం పే­ర్కొం­ది. పే­ర్ల తొ­ల­గిం­పు­ల­పై భారీ సం­ఖ్య­లో ప్ర­జల నుం­చి స్పం­దన వస్తే దర­ఖా­స్తు సమ­ర్ప­ణల తుది గడు­వు­ను ఎం­దు­కు పొ­డి­గిం­చ­కూ­డ­ద­ని జస్టి­స్‌ కాం­త్‌ ఎన్ని­కల సం­ఘా­న్ని ప్ర­శ్నిం­చా­రు.

బిహార్‌లో ఓటరు జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్‌ఐఆర్‌) వివాదంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. డిలీట్‌ చేసిన ఓటర్‌ పేర్లను సరిదిద్దే విషయంలో రాజకీయ పార్టీలు అచేతనంగా ఉండటంపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీలు చొరవతో ముందుకు రావాలని కోరింది. అదే సమయంలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ఓటర్‌ ఫ్రెండ్లీగా ఉండాలని పునరుద్ఘాటించింది. 'డిలీట్‌ చేసిన పేర్ల విషయంలో ఆధార్‌ కార్డు లేదా.. ఏదైనా ఆమోదయోగ్య పత్రంతో పాటు చేసే ఆన్‌లైన్‌ సబ్మిషన్లను అనుమతిస్తాం.' అని ధర్మాసనం పేర్కొంది. పేర్ల తొలగింపులపై భారీ సంఖ్యలో ప్రజల నుంచి స్పందన వస్తే దరఖాస్తు సమర్పణల తుది గడువును ఎందుకు పొడిగించకూడదని జస్టిస్‌ కాంత్‌ ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు.

Tags

Next Story