బుద్దిలేని హెడ్మాస్టర్.. బడిలో నగ్నంగా..
పాఠాలు చెప్పవలసిన మాస్టర్లు పనికి మాలిన పనులు చేస్తూ ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెస్తున్నారు. విద్యార్థులకు మార్గదర్శకంగా ఉండాల్సిన ఉపాధ్యాయులు అసహజ ప్రవర్తనతో అందరిలో నవ్వులపాలు అవుతున్నారు. ఫుల్లుగా మద్యం తాగి ఆ మత్తులో ఏం చేస్తున్నారో కూడా ధ్యాస ఉండట్లేదు.
విద్యార్థుల ముందు నగ్నంగా నిద్రించిన యూపీ స్కూల్ హెడ్‌మాస్టర్ వీడియో వైరల్ కావడంతో అతడిని సస్పెండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఒక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మద్యం మత్తులో విద్యార్థుల ముందు అసభ్యకర చర్యలకు పాల్పడ్డాడనే ఆరోపణపై సస్పెండ్ చేసినట్లు అధికారి తెలిపారు. నిందితుడు దుర్గా ప్రసాద్ జైస్వాల్ మద్యం మత్తులో పాఠశాలలో విద్యార్థుల ముందు నగ్నంగా నిద్రిస్తూ కనిపించాడు.
విద్యార్థుల ముందు జైస్వాల్ తరచూ అసభ్యకర చర్యలకు పాల్పడేవాడని తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ప్రధానోపాధ్యాయుడు క్లాసులో బట్టలు విప్పేసి విశ్రాంతి తీసుకుంటున్నారని వారు చెప్పారు. ఈ చేష్టలతో ఇబ్బంది పడి విద్యార్థినులు పాఠశాలలకు వెళ్లడం మానేసినట్లు వారు తెలిపారు. ఫిర్యాదుపై చర్య తీసుకున్న ఎడ్యుకేషన్ ఆఫీసర్ విచారణకు ఆదేశించిన తర్వాత జైస్వాల్‌ను సస్పెండ్ చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com