Teachers Make Drugs: స్కూల్ కు ఎగ్గొట్టి.. డ్రగ్స్‌ తయారు చేస్తున్న సైన్స్ టీచర్లు

కోట్ల విలువైన డ్రగ్స్‌ తయారు చేస్తున్న టీచర్స్‌

ఇద్దరు సైన్స్ టీచర్లు కోట్ల విలువైన డ్రగ్స్‌ తయారు చేస్తున్నారు.ప్రభుత్వ స్కూల్‌లో పని చేస్తున్న ఒక ఉపాధ్యాయుడు, కోచింగ్‌ సెంటర్‌లో ఉన్న మరో టీచర్‌ దీని కోసం సెలవుపెడుతున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు ఒక ఇంటిపై రైడ్‌ చేశారు. డ్రగ్స్‌ తయారు చేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులను అరెస్ట్‌ చేశారు. 25 ఏళ్ల మనోజ్ భార్గవ్, ముక్లావాలోని ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్‌లో సైన్స్ టీచర్‌గా పని చేస్తున్నాడు. మాజీ ఫిజిక్స్ టీచర్‌ ఇంద్రజీత్ విష్ణోయ్‌ ఒక కోచింగ్‌ సెంటర్‌లో శిక్షణ ఇస్తున్నాడు. రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఆర్‌ఏఎస్‌) కోసం అతడు ప్రిపేర్‌ అవుతున్నాడు.

కాగా, ఈ ఇద్దరు సైన్స్ టీచర్లు కలిసి శ్రీ గంగానగర్ ప్రాంతంలోని అద్దె అపార్ట్‌మెంట్‌లో రహస్యంగా డ్రగ్స్ తయారు చేస్తున్నారు. కావాల్సిన పరికరాలు, రసాయనాలు ఢిల్లీ నుంచి కొనుగోలు చేశారు. అప్పుడప్పుడు సెలవు తీసుకున్న వీరిద్దరూ గత రెండున్నర నెలల్లో రూ.15 కోట్ల విలువైన ఐదు కిలోల మెఫెడ్రోన్ తయారు చేశారు. ఇందులో 4.22 కిలోల డ్రగ్స్‌ను అమ్మారు.

మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు ఆ ఇంటిపై రైడ్‌ చేశారు. రూ.2.34 కోట్ల విలువైన 780 గ్రామల మెఫెడ్రోన్ డ్రగ్‌, దాని తయారి కోసం వినియోగించిన పరికరాలు, రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు టీచర్ల నుంచి డ్రగ్స్‌ కొనుగోలు చేస్తున్నవారిని, ఇందులో పాత్ర ఉన్న ఇతర వ్యక్తులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎన్సీబీ అధికారి తెలిపారు. రాష్ట్రంలోని డ్రగ్ సిండికేట్‌లో ఇది అతిపెద్దదని వెల్లడించారు.

Tags

Next Story