Gautam Adani: అదానీకి సెబీ షాక్ ..

బిలియనీర్ పారిశ్రామికవేత్త గౌతం అదానీకి ఇది షాకింగ్ న్యూసే. సోలార్ పవర్ కాంట్రాక్ట్‌ల కోసం ఆంధ్రప్రదేశ్, ఒడిశా సహా ఇతర రాష్ట్రాల అత్యున్నత స్థాయి వ్యక్తులకు దాదాపు రూ. 2,200 కోట్ల లంచం ఇచ్చినట్టు అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీ సహా ఇతరులపై అమెరికాలో అభియోగాలు నమోదైన వేళ సెక్యూరిటీస్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) రంగంలోకి దిగింది.
యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ నుంచి గ్రాండ్ జ్యూరీ ఆదేశాలను అదానీ గ్రూప్ ఉల్లంఘించిందో, లేదో తెలుసుకునేందుకు సెబీ ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది. అలాగే, షేర్ల ధరలను ప్రభావితం చేయగలిగే సమాచారాన్ని తప్పనిసరిగా వెల్లడించాలన్న నిబంధనలను అదానీ గ్రూప్ ఉల్లంఘించిందా? అన్న కోణంలో విచారిస్తున్నట్టు తెలిసింది. లంచం ఆరోపణలపై అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ దర్యాప్తు సమాచారాన్ని సమగ్రంగా వెల్లడించడంలో అదానీ గ్రీన్ ఎనర్జీ విఫలమైందా? అన్న విషయాన్ని తెలుసుకోవాలని స్టాక్ ఎక్స్‌చేంజ్ అధికారాలను సెబీ కోరినట్టు సమాచారం.
అలాగే, షేర్ల ధరలను ప్రభావితం చేయగలిగే సమాచారాన్ని తప్పనిసరిగా వెల్లడించాలన్న నిబంధనలను అదానీ గ్రూప్ ఉల్లంఘించిందా? అన్న కోణంలో విచారిస్తున్నది. లంచం ఆరోపణలపై అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ దర్యాప్తు సమాచారాన్ని సమగ్రంగా వెల్లడించడంలో అదానీ గ్రీన్ ఎనర్జీ విఫలమైందా? అన్న విషయాన్ని తెలుసుకోవాలని స్టాక్ ఎక్స్‌చేంజ్ అధికారాలను సెబీ కోరినట్టు సమాచారం. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను సెబీ ఈరోజు ఆదేశించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com