INDIAN ARMY: కరుడుగట్టిన ఉగ్రవాది హతం.. బాడీగార్డ్ కూడా..

కరుడుగట్టిన ఉగ్రవాది(Terrorist)ని మట్టుబెట్టాయి. భారత్(india)లోకి చొరబడేందుకు యత్నించిన ఇద్దరు ముష్కరులను భద్రతా బలగాలు(security forces) హతమార్చాయి. జమ్ముకశ్మీర్‌లోని పూంచ్( Poonch) జిల్లాలో హతమైన ఇద్దరిలో ఒకరిని హిజ్బుల్ ముజాహిదీన్ డివిజినల్ కమాండర్( Senior most commander of HM) మునీర్ హుస్సేన్(Muneser Hussain )గా గుర్తించామని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. అతడికి బాడీగార్డ్‌గా వచ్చిన అతన్ని కూడా హతమార్చామని వెల్లడించింది.
డేగ్వార్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద సైన్యానికి ఎదురుపడిన ఇద్దరు ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ధీటుగా స్పందించిన భద్రతా బలగాలు అప్రమత్తమై ఎన్‌కౌంటర్ (Encounter) చేశాయి. మృతుల్లో ఒకరిని మునీర్ హుస్సేన్‌గా గుర్తించామని జమ్మూకు చెందిన పీఆర్‌వో లెఫ్టినెంట్ కర్నల్ సునీల్ బర్ట్‌వాల్ తెలిపారు. మునీర్ పూంఛ్‌లోని బాగిలడ్రా గ్రామానికి చెందిన వ్యక్తి అని చెప్పారు. మరో ఉగ్రవాది మృతదేహం నియంత్రణ రేఖకు సమీపంలో పాక్ వైపు పడి ఉందని, అతను మరణించినట్లు భావిస్తున్నామని వెల్లడించారు.
మున్నీర్ హుస్సేన్ 1993లో పాకిస్థాన్ వెళ్లి 1996లో భారత్ తిరిగి వచ్చాడని, 1998 నుంచి అనేక దాడులకు పాల్పడుతున్నాడని భద్రతా దళాలు ప్రకటించాయి. గత 10 ఏళ్లలో అత్యంత భయంకరమైన ఉగ్రవాదిగా ఉన్నాడని వెల్లడించాయి. ఈ ఉగ్రవాదికి ఇద్దరు భార్యలు, పిల్లల ఉన్నారని, వారు పూంచ్ జిల్లాలోని సూరంకోట్‌లో ఉంటున్నారని వెల్లడించాయి. కరుడుగట్టిన ఉగ్రవాది మౌలానా దావూద్ కాశ్మీర్ (Maulana Dawood Kashmir )కు
మునీర్ హుస్సేన్( Syed Salauddin) అత్యంత సన్నిహితుడన్న భద్రతా దళాలు... హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు చెందిన సయ్యద్ సలావుద్దీన్‌తో ఇతనికి సన్నిహత సంబంధాలు ఉన్నాయని తెలిపారు.
మునీర్ హుస్సేన్‌తో పాటు అతని బాడీగార్డ్ కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేందుకు వచ్చారని, వారి అంతంతో ఉగ్రమూకలు కోలుకోలేని దెబ్బ తగిలిందని భద్రత దళాలు ప్రకటించాయి. దక్షిణ కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని పునరుద్ధరించే అతని ఆలోచలనకు తెరపడిందని వెల్లడించాయి. యువతను ఉగ్రవాదం వైపు ప్రేరేపించడానికి , రిక్రూట్ చేసుకోవడానికి పాత టెర్రర్ అనుభవజ్ఞులను పాకిస్థాన్ జమ్ముకశ్మీర్ పంపుతుందని స్పష్టం అవుతోందని భారత భద్రత బలగాలు ప్రకటించాయి. ఈ కుట్రలను భగ్నం చేస్తున్నామని వెల్లడించాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com