Cloudburst: క్లౌడ్‌ బరస్ట్‌ విధ్వంసం... ఏడుగురి మృతి

Cloudburst: క్లౌడ్‌ బరస్ట్‌ విధ్వంసం... ఏడుగురి మృతి
హిమాచల్‌ ప్రదేశ్‌లో జాదోన్‌ గ్రామంలో క్లౌడ్‌ బరస్ట్‌... గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం

హిమాచల్‌(Himachal )లోని సోలన్‌లో క్లౌడ్‌ బరస్ట్‌(cloudburst ) కారణంగా ఏడుగురు మరణించారు(seven killed). మరో ముగ్గురు గల్లంతయ్యారు( three persons have been missing). జాదోన్ గ్రామం(Jadon village )లో క్లౌడ్‌ బరస్ట్‌ కారణంగా ఒక్కసారిగా వరద సంభవించింది. దీనివల్ల ఏడుగురు మరణించారని అధికారులు(officials said ) తెలిపారు. గల్లంతైన ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టామని వెల్లడించారు. మరో అయిదుగురిని రక్షించామని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) కందఘాట్ సిద్ధార్థ ఆచార్య తెలిపారు.


క్లౌడ్‌ బరస్ట్‌ కారణంగా రెండు ఇళ్లు, గోశాల కూడా కొట్టుకుపోయాయని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. వర్షాల దృష్ట్యా హిమాచల్ ప్రదేశ్ విశ్వవిద్యాలయం పోస్ట్ గ్రాడ్యుయేట్ తరగతులు సహా అన్ని పరీక్షలను రద్దు చేసినట్లు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆగస్టు 14న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలను మూసివేస్తూ విద్యాశాఖ కార్యదర్శి నోటిఫికేషన్‌ జారీ చేశారు.

భారీ వర్షాల కారణంగా ఏర్పడిన పరిస్థితులపై నిఘా ఉంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శితో పాటు అధికారులు అందరినీ సీఎం ఆదేశించారు. పాలనా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, రోడ్లు, విద్యుత్తు, మంచినీటి ఏర్పాట్లను సజావుగా నిర్వహించాలని తెలిపారు. 24 గంటలుగా హిమాచల్ ప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న జల్లుల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. సిమ్లా-చండీగఢ్ రహదారితో సహా పలు రహదారులపై రాకపోకలను అధికారులు నిషేధించారు.

Tags

Read MoreRead Less
Next Story