Srinagar : జీలం నదిలో పడవ బోల్తా.. నలుగురు మృతి

Srinagar : జీలం నదిలో పడవ బోల్తా.. నలుగురు మృతి
X
నది దాటుతుండగా చోటుచేసుకున్న ప్రమాదం

నదిలో పడవ బోల్తాపడి చిన్నారుల మృతిచెందిన విషాదకర ఘటన జమ్మూ కశ్మీర్‌ లో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ సమీపంలో జీలం నదిలో పాఠశాల పిల్లలను తీసుకెళుతున్న పడవ బోల్తా పడటంతోఆరుగురు చిన్నారులు మరణించారు. పన్నెండు మంది చిన్నారులను వెంటనే స్థానికులు రక్షించగలిగారు. కొందరు స్థానికులు కూడా ఈ పడవలో ప్రయాణిస్తున్నారు. మరికొందరు గల్లంతయినట్లు చెబుతున్నారు. గత రెండు రోజులుగా కురుస్తోన్న వర్షాల కారణంగా స్థానికంగా జలాశయాలు ఉప్పొంగాయి.

గల్లంతయిన వారి కోసం సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఈ పడవ బోల్తా ఘటనలో నదిలో మునిగిపోయి రక్షించిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గండ్‌బాల్ నుంచి శ్రీనగర్ లోని బట్వారాకు పిల్లలను తీసుకెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. వర్షం కారణంగా జీలం నది ప్రవాహం ఎక్కువగా ఉండటంతో పాటు సామర్థ్యానికి మించి పడవలో మనుషులను ఎక్కించుకోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జీలం నది నీటిమట్టం పెరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. సోమవారం కురిసిన వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో జమ్మూ-శ్రీనగర్‌ జాతీయ రహదారిని సైతం అధికారులు మూసివేశారు.

Tags

Next Story