NCP: అజిత్ మా వాడే! శరద్ పవార్

NCP:  అజిత్ మా వాడే! శరద్ పవార్
అంతుబట్టని శరద్ పవార్ వ్యాఖ్యలు

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ NCPలో ఎలాంటి చీలిక లేదని ఆ పార్టీ అధినేత శరద్ పవార్ అన్నారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ .. తమ పార్టీ నాయకుడే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కొద్దీ రోజుల క్రితం అధికార శివసేన-బీజేపీ పార్టీతో చేతులు కలిపి డిప్యూటీ సీఎంగా బాధ్యతలను అజిత్ పవార్ స్వీకరించిన విషయం తెలిసిందే అయితే ఇప్పుడు శరద్ పవార్ చేసిన వ్యాఖ్యల అంతరార్థం ఏమిటో అంతుబట్టడం లేదు. ఆయన ఏ వ్యూహంతో అడుగులు వేస్తున్నారో తెలియడం లేదు. తన సమీప బంధువు అజిత్ పవార్ పార్టీని చీల్చి, బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పటికీ, తన పార్టీలో చీలిక లేదని చెప్తున్నారు.


ఎన్సీపీలోని కొందరు నేతలు భిన్నమైన రాజకీయ వైఖరితో ముందుకెళ్లారనీ అయితే దీన్ని "పార్టీలో చీలిక" అని చెప్పలేమని శరద్ పవార్ అన్నారు. ప్రజాస్వామ్యంలో సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు ఉందన్నారు. కొల్హాపుర్ లో ఓ ర్యాలీలో పాల్గొనేందుకు బయల్దేరేముందు పుణెలోని తన నివాసంలో శరద్ ఈ వ్యాఖ్యలు చేశారు. సర్వేలు ఇంకా అధ్యయనం చేయకపోయినప్పటికి, ఎన్సీపీ- శివసేన(యూబీటీ) మహా వికాస్ అఘాడిపై ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తోపాటు మరికొన్ని పార్టీలతో కలిసి ఏర్పాటు చేసిన ఇండియా కూటమి రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే కంటే మెరుగ్గా రాణిస్తుందని అన్నారు. గురువారం శరద్ కుమార్తె, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అజిత్ పవార్ తమ పార్టీలో సీనియర్ నాయకుడనీ.. ఆయన పార్టీ వ్యతిరేక చర్యపై అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేశామని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story