Shashi Tharoor : డప్పు వాయిద్యాలతో శశిథరూర్‌కు ఘన స్వాగతం..

Shashi Tharoor : డప్పు వాయిద్యాలతో శశిథరూర్‌కు ఘన స్వాగతం..
Shashi Tharoor : కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు

Shashi Tharoor : కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ పదవికి పోటీ చేస్తానని అందరికంటే ముందే ప్రకటించిన శశిథరూర్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఢిల్లీ అక్బర్ రోడ్డులోని ఏఐసీసీ కార్యాలయంలో అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు.

డప్పు వాయిద్యాలు, అభిమాన కార్యకర్తల గణంతో థరూర్‌ ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. పలువురు నేతలు, కార్యకర్తలు ఆయన వెంట పార్టీ ఆఫీసుకు వచ్చారు. అక్కడ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం ఛైర్మన్‌ మధుసూదన్‌ మిస్త్రీకి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. తిరువనంతపురం ఎంపీ అయిన శశిథరూర్ జీ 23 గ్రూపు నేతల్లో ఒకరిగా ఉన్నారు. అంతకు ముందు థరూర్‌ రాజ్‌ఘాట్‌ వెళ్లి జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.

Tags

Next Story