Shashi Tharoor : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ పై శశి థరూర్ కీలక నిర్ణయం..

Shashi Tharoor : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ పై శశి థరూర్ కీలక నిర్ణయం..
X
Shashi Tharoor : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు ఆ పార్టీ సీనియర్‌ నేత శశిథరూర్‌

Shashi Tharoor : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు ఆ పార్టీ సీనియర్‌ నేత శశిథరూర్‌. నోటిఫికేషన్‌ రాగా తన నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. కాంగ్రెస్సేతర వ్యక్తులు కూడా తన పట్ల ఆదరణ చూపడం సంతోషంగా ఉందన్నారు.

ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ హయాంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాం జరుగుతుందనే భావన నేతల్లో ఉందన్నారు. రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రకు అద్భుత స్పందన లభిస్తోందన్నారు. ప్రాంతీయ భాషలు మాట్లాడే దక్షిణాది రాష్ట్రాలపై బలవంతంగా హిందీ రుద్దడాన్ని ఆయన వ్యతిరేకించారు.

అలాగే తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్‌ పేరు పెట్టడాన్ని ఆయన అభినందించారు. పార్లమెంట్‌కు కూడా అంబేద్కర్‌ పేరు పెట్టాలన్నారు. ఇక ఫ్రెంచ్‌ ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారం తనకు దక్కిన గౌరవంగా భావిస్తామన్నారు శశిథరూర్‌. తమ సొంత పార్టీ కన్నా... ప్రెంచ్‌ ప్రభుత్వమే ఉన్నతంగా గౌరవించిందన్న ప్రశ్నకు వారు సమాధానం చెప్పాలన్నారు.

Tags

Next Story