Congress President Elections : రాహుల్ గాంధీయే నాకు పోటీ చేయమని చెప్పారు : శశిథరూర్

Congress President Elections : కాంగ్రెస్‌లో పార్టీ అధ్యక్షుని ఎన్నిక కాక రేపుతున్న వేళ ప్రెసిడెంట్ అభ్యర్థి, సీనియర్ నేత శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌గాంధీయే నన్ను కాంగ్రెస్ చీఫ్‌గా పోటీ చేయాలని చెప్పారన్నారు. తన నామినేషన్‌పై నెలకొన్న గందరగోళంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తనపై రాహులే పార్టీ బాధ్యతను మోపేందుకు తన అభ్యర్థిత్వాన్ని సూచించారని శశిథరూర్ చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి మల్లికార్జున ఖర్గే, మరోవైపు శశిథరూర్ పోటీపడుతున్నారు. వీరిద్దరిలో ఎవరు గెలుస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే.... మల్లికార్జున ఖర్గేకే ఎక్కువగా గెలుపు అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది.. నేతల మాటలు కూడా పదునెక్కుతున్నాయి.
దేశవ్యాప్తంగా పార్టీ నేతల మద్దతు కూడగట్టేందుకు పోటీ పడుతున్న ఇద్దరు నేతలు.. పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. మరోవైపు ఈనెల 8న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అప్పటిలోగా ఉపసంహరణలేమీ లేకపోతే 17న పోలింగ్ జరుగుతుంది. అక్టోబరు 19న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఎక్కువ ఓట్లు లభించిన అభ్యర్థి విజయం సాధించినట్లు ప్రకటిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com