Robotic Elephant: మఠానికి స్పెషల్ ఏనుగును విరాళంగా ఇచ్చిన శిల్పాశెట్టి జంట..

బాలీవుడ్ నటి శిల్పా షెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలోని రాంభాపురి మఠానికి ఒక రోబోటిక్ ఏనుగును దానం చేశారు. ఈ రోబోటిక్ ఏనుగు మఠంలోని భక్తులకు సేవలందించడానికి ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమం స్థానికంగా పెద్ద ఎత్తున జరగడంతో దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రోబోటిక్ ఏనుగు గుడి కార్యక్రమాలకు, పవిత్ర ప్రాంతాలకు సమీపానికి వెళ్లి భక్తులకు అభివాదాలు చెప్పడం వంటి పనులను చేయగలిగే సదుపాయాలను కలిగి ఉంది.
శిల్పా షెట్టి, రాజ్ కుంద్రా దంపతుల నిర్ణయంతో మఠానికి ఈ రోబోటిక్ ఏనుగును విరాళంగా ఇచ్చినట్లు తెలిపారు. ఈ దానంతో వారు భక్తులకు సౌకర్యవంతమైన, ఆధునిక సేవలను అందించే ప్రతిపాదనలో తమ వంతు పాత్ర పోషించారని చెప్పవచ్చు. ఇకపోతే, ఈ మధ్యన ఆలయాలకు నిజమైన ఏనుగులకు బదులుగా రోబోటిక్ ఏనుగును విరాళంగా ఇస్తున్నారు. ఇప్పటికే కర్ణాటకలోని యెడియూర్ లోని సిద్ధలింగేశ్వరాలయంలో కూడా ఈ రోబోటిక్ ఏనుగు ఉంది. కొందరు ఏనుగులను దానం చేయాలనుకున్నవారు ఆలయాలకు నిజమైన ఏనుగులను బదులు ఈ రోబోటిక్ ఏనుగులను విరాళంగా ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వీటిని ఉపయోగించడం ద్వారా పెద్ద కార్యక్రమాలలో ప్రజలకు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కూడా జరగవు. దింతో ఇప్పుడు శిల్పాశెట్టి దంపతులు కూడా ఇదే పద్దతిని వారు అనుసరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com