Rat Poison on Fruits: ఫ్రూట్స్ పై ఎలుకల మందు పూస్తున్నారన్న ఆరోపణలతో వ్యాపారులు అరెస్ట్ .. ఎక్కడంటే

Rat Poison on Fruits: ఫ్రూట్స్ పై  ఎలుకల మందు పూస్తున్నారన్న ఆరోపణలతో వ్యాపారులు అరెస్ట్ .. ఎక్కడంటే
X
ముంబై నగరంలోని ఉత్తర శివారు ప్రాంతం మలాద్‌లో ఘటన

ఎలుకల్ని హతమార్చేందుకు వినియోగించే ఎలుకల మందును వినియోగదారులకు అమ్మే పండ్లకు పూస్తున్న ఘటన కలకలం రేపుతోంది.

ముంబై మలాడ్‌ ప్రాంతంలో మనోజ్ సంగంలాల్ కేసర్వాని (42), రాహుల్ సదన్లాల్ కేసర్వానిలు పండ్ల వ్యాపారం నిర్వహిస్తుంటారు. అయితే, ఫ్రూట్స్‌ అమ్మే ప్రాంతంలో ఎలుకల బెడద ఎక్కువ. అందుకే స్టాల్‌పై ఉంచిన ఫ్రూట్స్‌కి ఎలుకల్ని చంపే మందును పూస్తున్నారు.

ఈ సంఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వ్యాపారుల దుకాణాన్ని సీజ్ చేసి, ఫుడ్ అడల్టరేషన్, ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించడం వంటి నేరాల కింద కేసులు నమోదు చేశారు.

నిందితులు విచారణలో, పండ్లను ఎలుకలు తినకుండా కాపాడటానికి రాటోల్‌ అనే విషపదార్థాన్ని వాడినట్లు చెప్పారు. అయితే, ఈ చర్య ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదమని అధికారులు స్పష్టం చేశారు. రాటోల్‌లో ఎల్లో ఫాస్ఫరస్ వంటి హానికర రసాయనాలు ఉంటాయి. వీటిని ఆహార పదార్థాలపై వాడటం చట్టవిరుద్ధం. స్థానికులు ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన తనిఖీలు, క్రమం తప్పని పరిశీలనలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ ఘటన కొనుగోలు దారుల్లో ఆందోళన నెలకొంది.

అరెస్టు చేసిన నిందితులను మనోజ్ కుమార్ కేసర్వానీ మరియు బిపిన్ కేసర్వానీగా గుర్తించారు. వీరిపై భారతీయ న్యాయ సంహిత (BNS) 2023లోని సెక్షన్లు 125, 274, 275, 286 కింద కేసులు నమోదు చేశారు. దుకాణాన్ని సీజ్ చేసి, మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దర్యాప్తులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఆహార భద్రత విషయంలో నిర్లక్ష్యం అస్సలు సహించబోమని అధికారులు హెచ్చరించారు. ప్రజలు పండ్లు కొనుగోలు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Tags

Next Story