🔴 సిద్దరామయ్య ప్రమాణ స్వీకారం

కర్ణాటకలో కాంగ్రెస్ మంత్రివర్గం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 12.30 గంటలకు బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్‌తోపాటు మంత్రులుగా కొందరు ప్రమాణం చేయనున్నారు.నిన్న ఢిల్లీలో నేత సిద్ధరామయ్య, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌లు కేబినెట్ కూర్పు, పోర్టుఫోలియోలపై పార్టీ పెద్దలతో విస్తృత చర్చలు జరిపారు. డీకే శివకుమార్ ప్రత్యేకంగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, మాజీ చీఫ్‌లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీలను కలిసి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.
ఇక కేబినెట్‌లోకి తీసుకునే వారి పేర్లను ఖారారు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని వివిధ వర్గాలు, ప్రాంతాలు, వర్గాలకు స్థానం దక్కేలా కేబినెట్ కూర్పు ఉంటుందన్నాయి. ఏఐసీసీ చీఫ్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేకు కేబినెట్‌లోకి తీసుకోనున్నారు. ఆయనతోపాటు జీ పరమేశ్వర, మునయప్ప,జార్జ్, ఎంబీ పాటిల్, సతీష్ జర్కిహోలి, రామలింగారెడ్డి, జమీర్ అహ్మద్‌ఖాన్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
ప్రమాణ స్వీకారోత్సవానికి కంఠీరవ స్టేడియంలో అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. లక్ష మందికి పైగా కార్యకర్తలు, అభిమానులు పాల్గొంటారని అంచనా వేశారు.భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు భారీగా స్టేడియానికి చేరుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి బిహార్ సీఎం నితీశ్, తమిళనాడు సీఎం స్టాలిన్, ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా హాజరవుతారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ తనకు బదులుగా పార్టీ ప్రతినిధిని పంపుతారని సమాచారం.
కంఠీరవ స్టేడియంలో ఏర్పాట్లను డీకే శివకుమార్ స్వయంగా పరిశీలించారు. ప్రజా ప్రతినిధులైన జేడీఎస్, బీజేపీ నేతలను కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించినట్లు శివకుమార్ చెప్పారు. ఇవాళ జరిగనున్న కేబినెట్ మొదటి భేటీలో కాంగ్రెస్ ప్రధాన హామీ అయిన 5 గ్యారంటీల అమలుపై నిర్ణయాలు తీసుకుంటామన్నారు.
Live Updates
- 20 May 2023 10:45 AM IST
సిద్దరామయ్య ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం బెంగళూరు చేరుకున్న తమిళనాడు సీఎం స్టాలిన్
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com