Sidhu Moose Wala: పంజాబ్‌లో ఎన్‌కౌంటర్.. సిద్ధూ మూసేవాలా హత్య కేసు నిందితులు హతం..

Sidhu Moose Wala: పంజాబ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు, గ్యాంగ్‌స్టర్ల మధ్య జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసు నిందితులు మన్‌ప్రీత్‌మన్నూ అనే షార్ప్ షూటర్ సహా జగ్‌రూప్ రూపా మన్నూలు హతమయ్యారు. ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. పాక్ సరిహద్దులో అటారి దగ్గర చిచాబక్నా గ్రామంలో నిందితులు దాగి ఉన్నారన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్ ఫోర్స్ ఆ తాన్ని చుట్టుముట్టారు. దాంతో ఇద్దరు గ్యాంగ్‌స్లర్లు పోలీసులపై కాల్పులు జరిపారు. అనంతరం ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి.
మే 29న జరిగిన సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మూసేవాలాపై తొలి తూటా పేల్చింది మన్‌ప్రీత్ మన్నూ అని పోలీసుల దర్యాప్తులో తెలిపారు. ఈ కేసులో పంజాబ్, ఢిల్లీ, ముంబైకి చెందిన పోలీసులు పలువురు నిందితులను అరెస్టు చేశారు. కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ సతీందర్‌జిత్ సింగ్, అలియాస్ గోల్డీ బ్రార్.. మూసేవాలా మర్డర్‌కు స్కెచ్ వేసినట్లు పోలీసులు తెలిపారు. గోల్డీ బ్రార్.. ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో సహాయంతో మూసేవాలా హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు స్పష్టంచేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com