Zubeen Garg: జుబీన్‌ గార్గ్‌ ప్రమాదవశాత్తూ మరణించలేదు.. సీఎం హిమంత శర్మ

Zubeen Garg:  జుబీన్‌ గార్గ్‌ ప్రమాదవశాత్తూ మరణించలేదు..  సీఎం హిమంత శర్మ
X
జుబీన్ ది హత్యేనని అసెంబ్లీలో వెల్లడించిన హిమంత బిశ్వ శర్మ

దేశవ్యాప్తంగా పేరొందిన అస్సామీ సింగర్ జుబీన్ గార్గ్ అకాల మరణంతో ఆయన కుటుంబం సహా అభిమానుల్లో తీవ్ర విషాదం నెలకొంది. సింగపూర్ లో స్కూబా డైవింగ్ చేస్తూ జుబీన్ సముద్రంలో మునిగి చనిపోయారు. ఇప్పటి వరకూ ఇది ప్రమాదవశాత్తూ జరిగిందని భావించగా.. తాజాగా అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ దీని వెనక కుట్ర ఉందని వెల్లడించారు. జుబీన్ ప్రమాదవశాత్తూ చనిపోలేదని, ఆయన హత్యకు గురయ్యారని అసెంబ్లీలో వెల్లడించారు. జుబీన్ హంతకులను వదిలిపెట్టబోమని, చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు.

సింగపూర్ లో జుబీన్ మృతి..

'నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్' లో పాల్గొనేందుకు జుబీన్ గార్గ్ సింగపూర్ వెళ్లారు. అక్కడ సెయింట్ జాన్స్ ఐలాండ్ తీరంలో లైఫ్ జాకెట్ లేకుండా ఈత కొడుతూ లేదా స్కూబా డైవింగ్ చేస్తుండగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. వెంటనే అతన్ని సింగపూర్ జనరల్ హాస్పిటల్‌లోని ఐసీయూకి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ఆయన మరణించారు. సింగపూర్ అధికారులు జుబీన్ మరణానికి కారణం "మునిగిపోవడం" అని పేర్కొంటూ డెత్ సర్టిఫికేట్ అందించారు. అయితే, ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడి, అనుమానాల కారణంగా అస్సాం ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించింది.

Tags

Next Story