Sini Shetty: మిస్ ఇండియా పోటీల్లో గెలిచిన కర్ణాటక బ్యూటీ సినీ శెట్టి బ్యాక్‌గ్రౌండ్..

Sini Shetty: ఫ్యాషన్ రంగం అనేది చాలామందికి కలల ప్రపంచం. కానీ ఆ ప్రపంచంలోకి అడుగుపెట్టే అదృష్టం అందరికీ దక్కదు. ఒకవేళ అడుగుపెట్టినా.. అందులో బెస్ట్‌గా నిలవాలంటే చాలా కష్టపడడంతో పాటు కొంచెం అదృష్టం కూడా కావాలి. అందుకే ఎంతమంది మిస్ ఇండియా పోటీలలో పాల్గొనాలనుకున్నా.. ఆ కిరీటం ఒక్కరినే వరిస్తుంది. ఈసారి ఆ కిరీటం కర్ణాటకకు చెందిన సినీ శెట్టిని వరించింది.
ప్రతీ ఏడాది ఫెమినా మిస్ ఇండియా పోటీలు చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతాయి. గతేడాది ఈ పోటీల్లో తెలుగమ్మాయి మానసా వారణాసి.. ఈ కిరీటాన్ని తెలుగు రాష్ట్రాలకు తీసుకొచ్చింది. ఇప్పుడు కర్ణాటకకు చెందని సినీ శెట్టి.. మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకోగా.. రాజస్థాన్‌కు చెందిన రూబల్ శెఖావత్ మొదటి రన్నరప్‌గా, ఉత్తరప్రదేశ్ యువతి షినాటా చౌహాన్ రెండో రన్నరప్‌గా నిలిచారు.
సినీ శెట్టి పుట్టి, పెరిగింది ముంబాయిలోనే అయినా తాను మిస్ కర్ణాటకగా పోటీల్లో దిగింది. 21 ఏళ్ల సినీ.. తన డిగ్రీ పూర్తి చేసుకొని మోడలింగ్‌లో కెరీర్‌ను ప్రారంభించింది. తను నాలుగేళ్ల నుండే భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టింది. మిస్ ఇండియా జర్నీని తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను అంటోంది సినీ శెట్టి. తను విన్నర్ అయిన సందర్భంగా ఫైనల్స్‌కు హాజరయిన బాలీవుడ్ సెలబ్రిటీలు తనకు కృతజ్ఞతలు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com