Smriti Irani : నా కూతురికి ఎలాంటి బార్ లేదు.. ఇదంతా కాంగ్రెస్ రాజకీయ కుట్ర..

Smriti Irani : కుమార్తె బార్ అండ్ రెస్టారెంట్ వివాదంతో.... కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చిక్కుల్లో పడ్డారు. ఆమె కుమార్తె జోయిష్ ఇరానీ... గోవాలోని అస్సాగోలో సిల్లీ సోల్స్ కేఫ్ అండ్ బార్ అనే రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే..ఈ బార్ అండ్ రెస్టారెంట్ మోసపూరితంగా మద్యం లైసెన్స్‌లు పొందినట్లు ఆరోపణలు వస్తున్నాయి. 2021 మేలో మరణించిన వ్యక్తి పేరిట ఈ ఏడాది జూన్‌లో జోయిష్ ఇరానీ లైసెన్స్ పొందినట్లు తెలుస్తోంది. దీంతో గోవా ఎక్సైజ్ కమిషనర్ నారాయణ్ సైతం ఈ నెల 21న రెస్టారెంట్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈనెల 29న ఈ అంశంపై కోర్టులో విచారణ జరగనుంది.
ఈ బార్ మద్యం లైసెన్స్ వివాదం... కాంగ్రెస్‌కు అస్త్రంగా మారింది. కేంద్రమంత్రి స్మృతి ఇరానీని టార్గెట్ చేశారు హస్తం నేతలు. 13 నెలల క్రితం మరణించిన వ్యక్తి పేరు లైసెన్స్ ఉండటం చట్టవిరుద్ధమన్నారు. నోటీసులు పంపిన అధికారిని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తనహోదాతో తొలగించారని ఆరోపిస్తున్నారు. తక్షణమే కేంద్రమంత్రి పదవి నుంచి ఆమె తొలగించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నేతల ఆరోపణలపై ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు స్మృతి ఇరానీ. 5 వేల కోట్లు దోచుకున్న సోనియా, రాహుల్‌ని ప్రశ్నిస్తున్నందుకే.. కాంగ్రెస్ నేతలు తన కుమార్తెను టార్గెట్ చేశారన్నారు. తన కుమార్తె గోవాలో చట్టవిరుద్ధంగా బార్ నిర్వహిస్తున్నారన్న ఆరోపణల్ని ఆమె ఖండించారు.18 ఏళ్ల తన కూతురు కాలేజీలోచదువుతోందని, ఆమె పేరుతో అనవసర రాజకీయం చేస్తున్నరంటూ మండిపడ్డారు. దీనిపై కోర్టుకు వెళ్తామన్నారు.
మొత్తానికి... తన కూమార్తెకు ఎలాంటి బార్ లేదని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ వాదిస్తుండగా.... అటు కాంగ్రెస్ మాత్రం.. ఆమెను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తోంది
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com