Smriti Mandhana: సమస్యల్ని పక్కన పెట్టి, సాధించాల్సిన వాటిపై దృష్టి పెట్టండి: స్మృతి

Smriti Mandhana: సమస్యల్ని పక్కన పెట్టి,  సాధించాల్సిన వాటిపై దృష్టి పెట్టండి: స్మృతి
X
భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన జరిగిన విషయాలను మరచి పోవడానికి ప్రయత్నిస్తోంది. ఆటపై దృష్టి పెట్టేందుకు తనని తాను సంసిద్ధం చేసుకుంటోంది. ఈ క్రమంలోనే సంగీత స్వరకర్త పలాష్ ముచ్చల్‌తో తన వివాహం రద్దు అయిందని ధృవీకరించిన తర్వాత ఆమె మొదటిసారి మీడియా ముందు కనిపించింది.

భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన జరిగిన విషయాలను మరచి పోవడానికి ప్రయత్నిస్తోంది. ఆటపై దృష్టి పెట్టేందుకు తనని తాను సంసిద్ధం చేసుకుంటోంది. ఈ క్రమంలోనే సంగీత స్వరకర్త పలాష్ ముచ్చల్‌తో తన వివాహం రద్దు అయిందని ధృవీకరించిన తర్వాత ఆమె మొదటిసారి మీడియా ముందు కనిపించింది.

అమెజాన్ సంభవ్ సమ్మిట్‌లో మాట్లాడుతూ, 29 ఏళ్ల స్మృతి జీవితంలో అనుకోని పరిణామాలు సంభవించినప్పటికీ ఆట తనను సమతుల్యం చేస్తుందని చెప్పింది. జీవితం సంక్లిష్టంగా మారినప్పుడు తనను తాను నిలబెట్టుకోవడానికి క్రికెట్ ఎల్లప్పుడూ ఒక మార్గాన్ని అందిస్తుందని ఆమె అన్నారు.

ఏదైనా ఒక రంగంలో ఎవరైనా విజయం సాధించారంటే దాని వెనుక ఎంతో కష్టం ఉంటుంది. అది ఎవరికీ తెలియదు.. తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఆ కష్టం పడే వాళ్లకి సంతృప్తిని ఇచ్చే రోజు ఒకటి ఉంటుంది. దాని కోసం ఎంతటి శ్రమ అయినా చేయాలి. స్థిరమైన కృషి మాత్రమే ఫలితాన్నిస్తుందని తెలిపింది.

"నేను ఎప్పుడూ చాలా సాధారణ వ్యక్తిని, దేని గురించి అయినా ఎక్కువగా ఆలోచించడం ద్వారా నా జీవితాన్ని క్లిష్టతరం చేసుకోను. మీరు తెరవెనుక చాలా ఎక్కువగా పని చేస్తేనే, నమ్మకంగా బ్యాటింగ్‌కు వెళ్తారు" అని ఆమె క్రికెట్ క్రీడాకారులను ఉద్దేశించి చెప్పింది.

నవంబర్ 2న నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో దక్షిణాఫ్రికాపై భారతదేశం సాధించిన చారిత్రాత్మక వన్డే ప్రపంచ కప్ విజయాన్ని మంధాన తిరిగి గుర్తుచేసుకుంది. సంవత్సరాల సమిష్టి సంకల్పానికి గుర్తు ఆ క్షణం అని అభివర్ణించింది.

"నాకు క్రికెట్ కంటే మరేదీ ఇష్టమని నేను అనుకోను. భారతీయ జెర్సీ ధరించడంతోనే తెలియని ఉద్వేగం, ఉత్సాహం మమ్మల్ని ఆవరిస్తుంది. మీరు మీ సమస్యలన్నింటినీ పక్కనపెట్టి, ముఖ్యమైన దానిపై దృష్టి పెట్టండి. బ్యాటింగ్ పట్ల పిచ్చి ఎప్పుడూ ఉండేది. ఎవరూ దానిని అర్థం చేసుకోలేదు, కానీ నేను ఎప్పుడూ ప్రపంచ ఛాంపియన్ అని పిలిపించుకోవాలని కోరుకున్నాను," అని ఆమె చెప్పింది.

"ప్రపంచ కప్ గెలవడం అనేది మేము సంవత్సరాలుగా చేసిన పోరాటానికి ప్రతిఫలం. ఇది మా అందరికీ ఒక ప్రత్యేక క్షణం." "నేను చాలా ప్రైవేట్ వ్యక్తిని, నేను దానిని అలాగే ఉంచాలనుకుంటున్నాను, కానీ వివాహం రద్దు చేయబడిందని నేను స్పష్టం చేయాలి. దయచేసి రెండు కుటుంబాల గోప్యతను గౌరవించాలని, మా కెరియర్ లో మేము ముందుకు సాగడానికి మాకు స్పేస్ ఇవ్వమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను" అని ఆమె తెలిపింది.

Tags

Next Story