Bangalore Snakes : బెంగళూరును వణికిస్తున్న పాములు.. రెండు రోజుల్లోనే వందల పాము కాట్లు..

Bangalore Snakes : బెంగళూరును వణికిస్తున్న పాములు.. రెండు రోజుల్లోనే వందల పాము కాట్లు..
X
Bangalore Snake : భారీ వర్షాలకు డ్రైనేజీలు పొంగి పొర్లి, ముంపునకు గురైన బెంగళూరు వాసులు ఇప్పుడు పాములతో హడలిపోతున్నారు

Bangalore Snakes : భారీ వర్షాలకు డ్రైనేజీలు పొంగి పొర్లి, ముంపునకు గురైన బెంగళూరు వాసులు ఇప్పుడు పాములతో హడలిపోతున్నారు. ఇళ్లను శుభ్రం చేసుకునే క్రమంలో పాములు, ఎలుకలు బయట పడుతున్నాయి. వాటిని బయటకు పంపించేందుకు ఇరుగుపొరుగు సాయం కోరుతున్నారు.

గత రెండు రోజుల్లోనే నగరవ్యాప్తంగా పాము కాట్ల కేసులు వందల సంఖ్యలో వెలుగు చూసినట్టు తెలుస్తోంది. చాలా ఆసుపత్రుల్లో యాంటీ స్నేక్ వీనమ్ సెరమ్ ఇంజెక్షన్ల నిల్వలు కూడా అయిపోయాయి. ఒకేసారి భారీ సంఖ్యలో పాము కాటు కేసులు రావడమే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది.

Tags

Next Story