Snake bite: పగబట్టి ప్రాణం తీసిందా?

Snake bite: పగబట్టి ప్రాణం తీసిందా?
వరుసగా 2 సార్లు కాటేసి ప్రాణాలు తీసిన పాము

నిజంగా పాము పగబడుతుంది లేదో తెలియదు కానీ అలాంటి సంఘటన రాజస్థాన్ లో జరిగింది. ఒకసారి కాటు వేసిన బతికి బయటపడ్డ ఒక వ్యక్తిని రెండోసారి కాటు వేసింది ఓ పాము. పాపం మొదటిసారి బతికి బట్ట కట్టాడు కానీ రెండవసారి అదే పాముకి బలయిపోయాడు.

రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో ఈ విషాదకరమైన సంఘటన జరిగింది. జూన్ 20న జసబ్ ఖాన్ అనే వ్యక్తిని ఓ పాము కాటు వేసింది. వెంటనే అతనిని పోఖ్రాన్‌లోని ఓ ఆసుపత్రి కి తీసుకు వెళ్లారు. యాంటి వినమ్ ఇచ్చిన డాక్టర్ లు చికిత్స అందించడంతో నాలుగు రోజులపాటు అక్కడే ఉంది కాస్త ఆరోగ్యం కుదుట పడ్డాక తిరిగి ఇంటికి చేరుకున్నారు. కానీ జూన్ 26న జసబ్ ఖాన్ మరోసారి పాము కాటుకు గురయ్యారు. ఈసారి కూడా వెంటనే చికిత్స పొందినప్పటికీ ప్రాణాలు నిలవలేదు. జోధ్‌‌పూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు.

జసబ్ ఖాన్ జోధ్‌పూర్ జిల్లాలోని మెహ్రన్‌గఢ్ కు చెందిన

జసబ్ ఖాన్‌ను ఓ రాజస్థాన్ ఎడారి పాము జూన్ 20న ఆయన కాలి చీలమండ వద్ద కాటు వేసింది. వెంటనే ఆయనను పోఖ్రాన్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. జూన్ 25న ఆయన ఆరోగ్యంగా తిరిగి ఇంటికి వచ్చారు. కానీ ఆ మర్నాడే ఆయనను ఓ పాము అదే కాలిపై కాటు వేసింది. ఈసారి కూడా ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయించినప్పటికీ ప్రాణాలతో బయటపడలేకపోయారు. అయితే మొదటి పాము కాటు నుంచి ఆయన ఇంకా పూర్తిగా కోలుకోలేదని, అందువల్ల ఆయన రెండో కాటు నుంచి సురక్షితంగా బయటపడలేకపోయారని వైద్యులు తెలిపారు. జసబ్ ఖాన్‌కు భార్య, తల్లి, నలుగురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఈ విషాదకర సంఘటనపై భనియానా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

అయితే పగ పట్టిందా లేదా అన్న విషయం ఎవరూ తెలుసుకోలేకపోవచ్చు.. కానీ అది పగ పట్టినా పట్టక పోయినా పాము విష జంతువే. అన్నట్టు ఆయనను రెండోసారి కాటువేసిన పామును కాసిదీరా చంపేశారు స్థానికులు.

Tags

Read MoreRead Less
Next Story