Maha Kumbh 2025: 37 రోజుల్లో 55 కోట్ల మంది పుణ్యస్నానాలు!

Maha Kumbh 2025:  37 రోజుల్లో  55 కోట్ల మంది పుణ్యస్నానాలు!
X
మహా కుంభమేళా మరో రికార్డు..

ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా గురించి అక్కడికి వస్తున్న భక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం అనేక మంది ప్రముఖులు పుణ్య స్నానాలు చేసేందుకు కుంభమేళాకు వస్తున్నారు. ఈక్రమంలోనే 37 రోజుల్లోనే 55 కోట్ల మార్కును దాటింది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ ఆధ్యాత్మిక కార్యక్రమానికీ ఇంత భారీ సంఖ్యలో జనాలు హాజరు కాలేదు.. జనవరి 13న మొదలైన ఈ ఆధ్యాత్మిక సంబరం ఫిబ్రవరి 26వరకు కొనసాగనున్న విషయం తెలిసిందే.

భారత దేశంలో మొత్తంగా 110 కోట్ల మంది సనాతనులు ఉండగా.. అందులో సగం మంది నేటితో కుంభమేళాలో పుణ్య స్నానాలు చేశారు. ఇలా 37 రోజుల్లోనే మొత్తంగా 55 కోట్ల మంది కుంభమేళాకు వచ్చి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. ఈ విషయం గుర్తించిన ఉత్తర ప్రదేశ్ సర్కారే నేరుగా ఈ విషయాన్ని ప్రకటించింది. ఇటీవలే ఓ రికార్డు సాధించిన కుంభమేళా మరో అరుదైన రికార్డు సాధించడం సంతోషంగా ఉందని చెప్పింది.

కుంభమేళా ముగిసే సరికి 60 కోట్లకు పైగా భక్తుల పుణ్య స్నానాలు..!

అలాగే మానవ చరిత్రలోనే ఏ మతపరమైన, సాంస్కృతిక, సమాజిక కార్యక్రమంలో ఇంత భారీగా జనం పాల్గొనలేదని పేర్కొంది. అలాగే జనవరి 13 ప్రారంభం అయిన కుంభమేలా ఫిబ్రవరి 26వ తేదీన ముగుస్తుండగా.. 60 కోట్లకు పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. ముందుగా 45 కోట్ల మంది మాత్రమే వస్తారని భావించినప్పటికీ.. ఊహించని స్థితిలో జనాలు వచ్చినట్లు చెప్పుకొచ్చింది. ముఖ్యంగా పండుగ రోజులు అయిన సంక్రాంతి రోజు 3.5 కోట్లు, మౌని అమావాస్య రోజు 8 కోట్లు, జనవరి 30వ 2 కోట్లు మంది వచ్చారని.. ఇలా ఇప్పటి వరకు 55 కోట్ల మంది కుంభమేళాలో పాల్గొన్నట్లు చెప్పింది.

Tags

Next Story