ఆదర్శవంతమైన కొడుకు.. అమ్మని జుట్టు పట్టుకుని లాగి..

ఆదర్శవంతమైన కొడుకు.. అమ్మని జుట్టు పట్టుకుని లాగి..
X
తల్లిని జుట్టు పట్టి లాగి, తండ్రిని చెప్పుతో కొట్టి కని పెంచిన తల్లిదండ్రుల రుణం బాగానే తీర్చుకున్నాడు.

తల్లిని జుట్టు పట్టి లాగి, తండ్రిని చెప్పుతో కొట్టి కని పెంచిన తల్లిదండ్రుల రుణం బాగానే తీర్చుకున్నాడు. అమ్మానాన్న మీద అంత ఆవేశం ఎందుకొచ్చిందో.. కారణం కుటుంబ కలహాలుగా చెప్పినా వృద్ధ తల్లిదండ్రులను కొట్టేంత కోపం ఉండకూడదని స్థానికులు తమలో తాము మాట్లుకుంటున్నారు.

కుటుంబంలో ఆస్తి వివాదం కారణంగా వృద్ధ తల్లిదండ్రులను దారుణంగా కొట్టినందుకు ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా మదనపల్లిలో తన వృద్ధ తల్లిదండ్రులపై శారీరకంగా దాడి చేశాడు. ఆస్తి పంపకాల వివాదంలో ఆ వ్యక్తి తల్లిదండ్రులపై దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. నిందితుడిని శ్రీనివాసులు రెడ్డిగా గుర్తించారు.

ఆదివారం ఆస్తి విషయంలో రెడ్డికి, అతని తల్లిదండ్రులకు మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో దాడికి దిగాడు. ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు అతడిపై చర్యలు తీసుకున్నారు. వీడియో క్లిప్‌లో నిందితుడు నేలపై కూర్చున్న తన వృద్ధ తల్లి జుట్టును లాగి కొట్టడం చూపిస్తుంది. నేల మీద పడి ఉన్న తల్లిని చాలాసార్లు తన్నాడు. ఆ తర్వాత తన తండ్రిని చెంపదెబ్బ కొట్టడం ప్రారంభించాడు.

కన్నకొడుకు తమను అనరాని మాటలు అంటుంటే ఆమె సహించలేకపోయింది. ఆపమని వేడుకుంది. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మదనపల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ యువరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఆస్పత్రిలో ఉన్న వృద్ధ దంపతులను కలిసి కుమారుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. శ్రీనివాసులురెడ్డిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంతో 324, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ కొనసాగుతోంది' అని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

Tags

Next Story