Son Kills Father: తండ్రిని చంపి ముక్కలు చేసిన కొడుకు .. వీడిన లక్నో మర్డర్ మిస్టరీ

యూపీ రాజధాని లక్నోలో 21 ఏళ్ల వ్యక్తి తన తండ్రిని అత్యంత కిరాతకంగా(Son Kills Father) చంపేశాడు. తొలుత తండ్రిని షూట్ చేసి, ఆ తర్వాత శరీరాన్ని ముక్కలుగా కోశాడు. కొన్ని భాగాలను పడేశాడు. మొండాన్ని ఇంట్లోని ఓ డ్రమ్ములో దాచాడు. ఈ ఘటనకు చెందిన వివరాలు ఇలా ఉన్నాయి. 49 ఏళ్ల మన్వేంద్ర సింగ్ ఓ వ్యాపారి. ఆయనకు ఫార్మసీ, లిక్కర్ బిజినెస్ ఉన్నది. అయితే శుక్రవారం నుంచి ఆయన ఆచూకీ లేదు. ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులకు అసలు కథ అర్థమైంది. ఆ వ్యాపారి శరీర భాగాలను ఇంట్లో ఉన్న డ్రమ్ములో గుర్తించారు. ఈ కేసులో అతని కుమారుడు అక్షత్ ప్రతాప్ సింగ్‌ను విచారించారు. తండ్రిని మర్డర్ చేసినట్లు అక్షత్ అంగీకరించాడు.
కొడుకు మెడికల్ కెరీర్‌ను ఎంపిక చేసుకోవాలని తండ్రి ఆశించాడని, కానీ కెరీర్ విషయంలో తండ్రీకొడుకుల మధ్య విబేధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాంపిటీటివ్ పరీక్షలకు ప్రిపేరయ్యేందుకు అక్షత్ నిరాకరించాడు. గతంలో ఈ విషయంలో ఓసారి ఇంటి నుంచి కూడా అతను పారిపోయాడు. కానీ శుక్రవారం సాయంత్రం మళ్లీ కెరీర్ విషయంలో తండ్రీకొడుకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో రైఫిల్‌తో తండ్రిని షూట్ చేశాడు కొడుకు. మూడవ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌కు బాడీని తెచ్చి.. ఆ రూమ్‌లో శరీరాన్ని ముక్కలు కోసేశాడు.
తండ్రిని చంపినట్లు నిందిత వ్యక్తి సోదరి ప్రత్యక్షంగా చూసింది. దీంతో ఆమెను బెదిరించి నోరెత్తకుండా చేశాడు. కొన్ని శరీర భాగాలను ప్లాస్టిక్‌లో చుట్టేసి సదరున ప్రాంతంలో పడేశాడు. మొండం మాత్రం ఇంట్లో ఉన్న బ్లూ రంగు డ్రమ్ములో దాచేశాడు. ప్రస్తుతం ఫోరెన్సిక్ దళాలు ఇంట్లో నుంచి శ్యాంపిళ్లను సేకరిస్తున్నాయి. ఇతర శరీర భాగాల కోసం కూడా అన్వేషిస్తున్నారు. సాక్ష్యాల ఆధారంగా అక్షత్‌పై కేసు నమోదు చేయనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
