Sonia Gandhi: సోనియాగాంధీ పర్సనల్ సెక్రటరీపై అత్యాచార ఆరోపణల కేసు..

X
Sonia Gandhi: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వ్యక్తిగత కార్యదర్శిపై అత్యాచార ఆరోపణల కేసు నమోదైంది. సోనియా పర్సనల్ సెక్రటరీ మాధవన్.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపి తనపై అత్యాచారం చేశాడని 26 ఏళ్ల మహిళ ఆరోపించింది. మాధవన్‌పై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ కంప్లైంట్‌తో ఢిల్లీ పోలీసులు మాధవన్‌పై కేసు నమోదు చేశారు. త్వరలో దర్యాప్తు పూర్తిచేస్తామంటూ డీసీపీ హర్హవర్ధన్ స్పష్టం చేశారు. అత్యాచార ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నారు సోనియా గాంధీ పర్సనల్ సెక్రటరీ మాధవన్. కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం కోసమే కుట్రపూరితంగా కేసు నమోదు చేశారని విమర్శించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
