Sonia Gandhi: ఈడీకి సోనియా గాంధీ లేఖ.. విచారణకు రాలేనంటూ..
Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు హాజరుకాలేనంటూ ఈడీకి లేఖ రాశారు సోనియా గాంధీ.

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు హాజరుకాలేనంటూ ఈడీకి లేఖ రాశారు సోనియా గాంధీ. మరికొన్ని వారాల పాటు విచారణ వాయిదా వేయాలని లేఖలో పేర్కొన్నారు. ఈ వివరాలు.. ట్విట్టర్ ద్వారా కాంగ్రెస్ నేత జైరాం రమేష్ వెల్లడించారు. కొవిడ్, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స పొందిన సోనియా.. ఇటీవలె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో ఈడీ విచారణ వాయిదా వేయాలని కోరారు.
తాను ఇప్పట్లో విచారణకు హాజరుకాలేనని.. మరికొన్ని వారాల పాటు వాయిదా వేయాలని ఈడీని లేఖ ద్వారా కోరారు. అయితే రేపే సోనియా విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే ఈ లేఖపై ఈడీ అధికారులు ఇంకా స్పందించలేదు. ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. గత కొన్ని రోజుల క్రితమే సోనియాగాంధీకి ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. అయితే సోనియా మాత్రం రేపు ఈడీ ముందుకు వెళ్లడానికి సుముఖంగా లేరు. అనారోగ్య కారణాల దృష్ట్యా రాలేమని చెబుతున్నారు.
RELATED STORIES
Producers Guild: నాని, నితిన్‌లను లెక్క చేయని "ప్రొడ్యూసర్స్...
13 Aug 2022 1:00 PM GMTSurekha Vani: సురేఖ వాణికి రెండో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన కూతురు..
13 Aug 2022 12:00 PM GMTNamrata Shirodkar: 'నువ్వు ఎగరడానికి సిద్ధం'.. కుమారుడిపై నమత్ర...
13 Aug 2022 11:15 AM GMTPavan Tej Konidela: పెళ్లి చేసుకోనున్న కొణిదెల వారసుడు.. హీరోయిన్‌తో...
13 Aug 2022 10:24 AM GMTNaga Chaitanya: సమంత మళ్లీ కలిస్తే అలా చేస్తానంటున్న చైతూ..
11 Aug 2022 5:20 AM GMTPoorna: పూర్ణ పెళ్లి ఆగిపోయిందంటూ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన నటి..
11 Aug 2022 2:12 AM GMT