KERALA: చిట్టితల్లీ... మమ్మల్ని క్షమించు

కేరళలో అయిదేళ్ల చిన్నారి(5-year-old raped)ని ఓ వలస కార్మికుడు కిడ్నాప్ చేసి హత్యాచారం చేసిన ఉదంతం( five-year-old girl was raped and murdered) దేశాన్ని కుదిపేస్తోంది. ప్రజలందరినీ తీవ్ర మనోవేదనకు గురిచేస్తోంది. బాలికను తల్లిదండ్రులతో కలిపేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చిన్నారి మృతదేహం నిర్మానుష్య ప్రాంతంలో లభ్యమైంది. ఘటనపై కేరళ పోలీసుల(Kerala Police)తో పాటు కేరళ గవర్నర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షమించు.. చిట్టి తల్లీ(Sorry daughter) అంటూ పోలీసులు బహిరంగంగా క్షమాపణలు( Kerala Police on Saturday posted an apology) చెప్పారు. నిందితుడికి మరణశిక్ష విధించాలంటూ కేరళలో చాలా చోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి.

చిన్నారిని చంపేసిన నిందితుడు మనిషిగా పిలిచేందుకు అర్హుడు కాదన్నారు. అంత్యక్రియల ముందు బాలికమృతదేహాన్ని కొచ్చిలో ఆమె చదువుకున్న పాఠశాలలో ఉంచారు. స్థానికులు, రాజకీయ నాయకులు చిన్నారికి నివాళి అర్పించారు. నిందితుడు అస్ఫాక్ ఆలాంకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. అనంతరం బాలిక మృతదేహానికి వేలాదిమంది సమక్షంలో అంత్యక్రియలు జరిగాయి.
కేరళలోని అలువా(Aluva)లో ముక్కుపచ్చలారని అయిదేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి అత్యాచారానికి( sexually assaulted) పాల్పడి కర్కషంగా గొంతుకోసి హతమార్చిన ఉదంతం స్థానికుల హృదయాలను కలచివేస్తోంది. బాలికను కాపాడలేకపోయిన పోలీసులు చిన్నారికి క్షమాపణలు చెప్పారు. చిన్నారిని తల్లిదండ్రులతో కలపలేక పోయినందుకు చింతిస్తున్నట్లు తెలిపారు. సామాజికమాధ్యమాల్లో(social media) క్షమాపణలు తల్లీ అంటూ పోలీసులు పోస్టులు చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేరళ గవర్నర్(kerala governer) ఆరిఫ్ మహమ్మద్‌ఖాన్ ప్రభుత్వాన్ని కోరారు.
బాలిక కుటుంబం బిహార్ నుంచి వలస వచ్చి కేరళలోని అలువాలో ఉపాధి చేస్తూ జీవనం సాగిస్తోంది. శుక్రవారం చిన్నారి స్థానికంగా ఉండే గార్బేజీ వద్ద ఆడుకుంటూ ఉండగా అక్కడే ఉన్న అస్ఫాక్ ఆలాం అనే వ్యక్తి బాలికను కిడ్నాప్ చేశారు. అనంతరం బాలిక ఏడవకుండా ఉండేందుకు చాక్లెట్ కొనిచ్చినట్లు తెలిసింది. చిన్నారిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్తుండగా అనుమానం వచ్చిన ఓ స్థానికుడు ఎవరని అడగ్గా.. తన బిడ్డ అని అస్ఫాక్ చెప్పాడు. పాప కిడ్నాప్ అయినట్లు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో పోలీసులకు ఫిర్యాదు అందింది. సీసీటీవీ ఆధారంగా రాత్రి తొమ్మిదిన్నర గంటలకు అస్‌ఫాక్‌ను పోలీసులు పట్టుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

