Chandrayaan-3: చంద్రయాన్-3 తొలి అడుగు విజయవంతం

బిల్లి రహస్యాలను ఛేదించేందుకు భారత అంతరిక్ష పరిశోధ సంస్థ (ISRO) చేపట్టిన చంద్రయాన్-3(Chandrayaan-3) తొలి అడుగు విజయవంతమైంది. చందమామపై పరిశోధనల కోసం ప్రయోగించిన చంద్రయాన్-3 వ్యోమనౌక తొలి కక్ష్య పెంపు కసరత్తును ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. బెంగళూరులోని ఇస్ట్రాక్ కేంద్రం నుంచి ఈ విన్యాసాన్ని చేపట్టింది. దీనివల్ల చంద్రయాన్ ఇప్పుడు 173× 41,762 (41762kms x 173kms orbit) కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలోకి ప్రవేశించింది. వ్యోమనౌకలోని అన్ని వ్యవస్థలూ సాఫీగా... సాధారణంగా(health is normal)నే పనిచేస్తున్నాయని ఇస్రో వెల్లడించింది.
చారిత్రాత్మక చంద్రయాన్-3 ప్రయోగంలో తొలి అడుగు విజయవంతమైందని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ ఎస్ ఉన్నికృష్ణన్ నాయర్ తెలిపారు. లాంచ్ వెహికల్ పనితీరు అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. అంతరిక్షనౌకకు అవసరమైన ప్రారంభ పరిస్థితులను చాలా కచ్చితంగా అందించినట్టు తెలిపారు. తొలి అడుగు వందశాతం విజయవంతం కావడంతో తుది అడుగు కూడా విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
40 రోజుల ప్రయాణం అనంతరం ఆగస్టు 23న సాయంత్రం 5.47 గంటలకు చంద్రుడి దక్షిణ ధ్రువంపై రోవర్(ROVER) అడుగుపెట్టనుంది. 40 రోజుల తర్వాతే శాస్త్రవేత్తలకు అసలైన సవాలు ఎదురవుతుంది. చంద్రయాన్ 3 లో వాడిన ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్, రోవర్లను దేశీయంగా అభివృద్ధి చేశారు. ప్రొపల్షన్ మాడ్యూల్ బరువు 2,148 కేజీలు కాగా, ల్యాండర్ విక్రమ్ బరువు 1,723.89, రోవర్ ప్రజ్ఞాన్ బరువు 26 కేజీలు.
చంద్రుడి సమీపంలోకి చేరుకున్న తర్వాత ల్యాండర్-రోవర్.. పేలోడ్ ప్రొపల్షన్ నుంచి విడిపోయి ల్యాండ్ అవుతుంది. ఆపై రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుడిపై కలియదిరుగుతూ పరిశోధనలు ప్రారంభిస్తుంది. లేజర్ కిరణాలను ఉపయోగించి..చంద్రయాన్-3 మూన్‌కేక్స్, చంద్రుడి నేల కూర్పు, వాతావరణంపై అధ్యయనం చేస్తుంది. సేకరించిన సమాచారాన్ని డిజిటలైజ్ చేసి చంద్రుడి చుట్టూ తిరుగుతున్న ప్రొపల్షన్ మాడ్యూల్ రిసీవర్‌కు పంపుతుంది. అక్కడి నుంచి అది శాస్త్రవేత్తలకు చేరుతుంది. చంద్రుడి కంపనాలపై అధ్యయనం చేసే ప్రజ్ఞాన్ ఫొటోగ్రాఫ్‌లను కూడా పంపుతుంది. ఉపరితలంపై ఓ ముక్కను కరిగించేందుకు, ఈ ప్రక్రియలో విడుదలయ్యే వాయువులను పరిశీలించేందుకు ప్రజ్ఞాన్ లేజర్ కిరణాలను ఉపయోగిస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com