Maharashtra : మోదీ సక్సెస్, రాహుల్ ఫ్లాప్..!

మహారాష్ట్రలో బీజేపీ విజయానికి కారణం ఏంటి?

అనుమానాలు తొలగిపోయాయి. అంచనాలు నిజమయ్యాయి. మహారాష్ట్రలో బీజేపీ విక్టరీ అలాంటి ఇలాంటి విజయం కాదు. చరిత్ర గుర్తుంచుకునే గెలుపు. 288 అసెంబ్లీ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో మోదీ మ్యాజిక్ తో మ్యాజిక్ ఫిగర్ కూడా చిన్నదైపోయింది. బీజేపీ ఈ స్థాయి విజయానికి కారణం ఏంటి? లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి చేతిలో దెబ్బతిన్న కమలం ఎలా బౌన్స్ బ్యాక్ అయ్యింది. సీక్రెట్ ఆఫ్ విక్టరీ ఏంటి?

ఎగ్జిట్ పోల్స్ కూటమికి అనుకూలంగా వచ్చినా ఎక్కడో ఏదో తెలియని డౌట్. అలా వెంటాడతూనే వచ్చింది. ఉద్ధవ్ ఠాక్రే సర్కార్ ను కూల్చి బీజేపీ పగ్గాలు చెపట్టిందనే విమర్శలు, విశ్లేషణలు.. ఇవేవీ జనాలపై ప్రభావం చూపించలేదు. అన్ని అనుమానాలను పటాపంచలు చేస్తూ బీజేపీ కూటమికి అద్భుత విజయాన్ని అందించారు మహా ఓటర్లు.

బీజేపీ విజన్ కు సీఎం, షిండే చివరి దశలో అనుసరించిన వ్యూహానికి జనం ఫిదా అయిపోయారు. కట్ చేస్తే 30 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒకే కూటమి 210 స్థానాలకుపైగా జనం పట్టం కట్టారు. ఎన్నికలకు ముందే ఏర్పడిన ఓ కూటమిని మహా ఓటర్లు గెలిపించడం 1990 తర్వాత ఇదే. ఈ స్థాయి మెజారిటీ దక్కుతుందని బీజేపీ కూడా ఊహించలేదట. లోక్ సభ ఎన్నికల్లో ఎదురైన పరాభవానికి నాలుగింతలు ప్రతీకారం తీర్చుకున్నట్లు బీజేపీ, కూటమి విజయం కనిపించింది.

హర్యానా ఫార్ములానే మహారాష్ట్రలోనూ పక్కాగా ఫాలో అయిన కమలం పార్టీ అద్భుత విజయం సాధించింది. హర్యానాలో నాన్ జాట్లను ఏకం చేసినట్లు మహారాష్ట్రలో ఓబీసీల సమీకరణలో ఎన్డీయే సూపర్ సక్సెస్ అయ్యింది. మరాఠా ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు గ్రహించిన కమలం టీమ్ వ్యూహానికి పదును పెట్టింది. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో మాద్వా ఫార్మాలను అప్లయ్ చేసింది. మాలి, దంగర్, వంజరి వర్గాలు మరాఠాలకు ఓబీసీ రిజర్వేషన్లు ప్రకటిస్తే తమ వాటా తగ్గుతుందనే భయాల్లో ఉన్నాయి. వాటిని ఓట్లుగా మలచడంలో సక్సెస్ అయ్యింది. పూర్తిగా మరాఠాల మీదే ఆధారపడటం కాంగ్రెస్ కూటమిని దెబ్బతీసింది.

Tags

Next Story