Manmohan Singh: మన్మోహన్ అంత్యక్రియల్లో పాల్గొనే ప్రముఖులు వీరే

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు శనివారం అనగా ఈరోజు జరగనున్నాయి. ఉదయం 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు పార్టీ నేతలు, కార్యకర్తల సందర్శనార్థం ఏఐసీసీ కార్యాలయంలో మన్మోహన్ భౌతికకాయాన్ని ఉంచనున్నారు. అనంతరం 9:30 గంటలకు ఏఐసీసీ కార్యాలయం నుంచి నిగమ్ బోధ్ ఘాట్‌కు అంతిమయాత్ర జరగనుంది. మన్మోహన్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి.
ఇదిలా ఉంటే శనివారం జరిగే అంత్యక్రియల్లో ప్రధాని మోడీ సహా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, తదితర ప్రముఖులంతా హాజరుకానున్నారు. చివరిసారిగా నేతలంతా నివాళులర్పించనున్నారు. కాశ్మీర్ గేట్ దగ్గర నిగమ్ బోధ్ ఘాట్‌లో మన్మోహన్‌కు నివాళులర్పించనున్నారు.
ప్రముఖుల షెడ్యూల్ ఇదే..
ఉ.11:15కి హోం సెక్రటరీ
ఉ.11:17కి డిఫెన్సీ సెక్రటరీ
ఉ.11:19కి ఎయిర్ స్టాప్ చీఫ్
ఉ.11: 21కి నేవల్ స్టాప్ చీఫ్
ఉ.11:23కి ఆర్మీ స్టాప్ చీఫ్
ఉ.11:25కి డిఫెన్సీ స్టాప్ చీఫ్
ఉ.11:27కి కేబినెట్ సెక్రటరీ
ఉ.11:29కి రక్ష రాజ్య మంత్రి
ఉ.11:31కి రక్ష మంత్రి
ఉ.11:33కి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా
ఉ.11:36కి ప్రధాని మోడీ
ఉ.11:39కి ఉపరాష్ట్రపతి
ఉ.11:42కి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నివాళులర్పించనున్నారు. చివరిగా మన్మోహన్ అంత్యక్రియలు ఉదయం. 11.45గంటలకు జరుగుతాయని కేంద్ర హోంశాఖ వెల్లడించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com