Stone Pelting In Shivamogga: శివమొగ్గలో ఉద్రిక్తత, సెక్షన్ 144 విధింపు

అక్టోబర్ 1న రాళ్లదాడి జరిగినట్లు వచ్చిన ఆరోపణలతో ఉద్రిక్తత నెలకొని ఉన్న శివమొగ్గ జిల్లా యంత్రాంగం అక్కడి రాగి గుడ్డ ప్రాంతంలో నిషేధాజ్ఞలు విధించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, ఈద్ మిలాద్ ఊరేగింపుపై రాళ్ల దాడి జరిగిందని పుకార్లు రావడంతో ఆగ్రహించిన ఓ గుంపు.. ఇళ్లు, వాహనాలపై రాళ్లు రువ్వి పలువురిని గాయపరిచిందని చెబుతున్నారు.
అయితే తాము ఆ గుంపును చెదరగొట్టామని, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారని, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌తో సహా అదనపు బలగాలను సంఘటనా స్థలానికి పంపించామని పోలీసులు చెప్పారు. ఈ ఘటను కారణమైన వారిలో కొందరిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు వారు తెలిపారు.
VIDEO | Tensions in Karnataka's Shivamogga after incident of stone pelting; police forces deployed in several localities. More details are awaited. pic.twitter.com/KKBokZUL0A
— Press Trust of India (@PTI_News) October 1, 2023
అంతకుముందు రోజు, ఊరేగింపులో భాగంగా ఉంచిన కటౌట్‌పై అదే ప్రాంతంలో నిరసనలు చెలరేగాయి. వివాదాస్పద (కంటెంట్) కారణంగా పోలీసులు అందులో కొంత భాగాన్ని కవర్ చేశారని, ఇది ఒక సంఘంలోని ప్రజలను కలవరపరిచిందని పోలీసు అధికారి తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న శివమొగ్గ పోలీసు సూపరింటెండెంట్ జికె మిథున్ కుమార్, ఇతర పోలీసు అధికారులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రజలతో చర్చలు జరిపారు.
Karnataka: District Administration imposes Section 144 of the CrPC in the Ragi Gudda area of Shivamogga after instances of stone-pelting and communal violence last night.
— ANI (@ANI) October 2, 2023
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com