వీధి కుక్కకు రేబిస్.. 29 మందిని కరవడంతో చంపేసిన స్థానికులు

వీధి కుక్కకు రేబిస్.. 29 మందిని కరవడంతో చంపేసిన స్థానికులు
ఏ నగరంలో చూసినా వీధుల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉంటోంది.

ఏ నగరంలో చూసినా వీధుల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉంటోంది. చిన్నారులు, పెద్ద వారితో సహా కుక్కలు తిరుగాడే మార్గం గుండా వెళ్లాలంటే భయపడుతున్నారు. చెన్నైలోని ఓ వీధిలో రేబిస్ సోకిన కుక్క స్థానికులను కరవడంతో దానిని కొట్టి చంపేశారు.

చెన్నైలో 29 మందిని కరిచిన వీధికుక్కకు రేబిస్ పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. రోయపురం ప్రాంతంలో పాదచారులపై కుక్క దాడి చేసి వారి పాదాలు, చీలమండలను కొరికింది. అది గంట వ్యవధిలో 29 మందిని కరిచింది.

పౌర అధికారులు కుక్క మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మద్రాసు వెటర్నరీ కాలేజీకి పంపగా, శాంపిల్స్ పాజిటివ్‌గా వచ్చాయని తెలిపారు. కుక్కకాటుకు గురైన వారిలో 10 మంది పాఠశాల విద్యార్థులు, మరికొందరు వృద్ధులు కూడా ఉన్నారు. కుక్క వెంబడించడంతో పరిగెడుతూ కిందపడి పోవడంతో కొందరి తలకు గాయాలయ్యాయి. వారిలో కనీసం 24 మంది కుక్క కాటు కారణంగా రేబిస్ సోకుతుందని భయపడిపోతున్నారు.

బాధితులను రాత్రికి రాత్రే ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి వారికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్‌లు వేశారు. వారు మరో నాలుగు ఇంజక్షన్ల కోసం తిరిగి రావాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యుడు తెలిపారు. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కమీషనర్ జె రాధాకృష్ణన్ మాట్లాడుతూ, సంఘటన తర్వాత పౌర అధికారులు ఈ ప్రాంతం నుండి 52 కుక్కలను పట్టుకుని వాటికి రేబిస్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.

నవంబర్ 27 నుంచి కుక్కలన్నింటికీ వ్యాక్సిన్‌ వేస్తున్నాం. ఏటా 15,000-17,000 స్టెరిలైజేషన్‌ చేస్తున్నాం. రాయపురంలో 29 మందికి ఇమ్యునోగ్లోబులిన్‌లు అందించారు. తమిళనాడు ఆరోగ్య మంత్రి మా సుబ్రమణియన్ నివాసితుల భయాలను పోగొట్టడానికి ప్రయత్నించారు. చెన్నై అంతటా కుక్కలను చెకప్ చేయమని హామీ ఇచ్చారు.

"భయపడాల్సిన అవసరం లేదు, వైద్యులు వాటి ఆరోగ్యంపై సలహా ఇస్తారు," అని మంత్రి చెప్పారు. కుక్కల ద్వారా వచ్చే రాబిస్ వ్యాధికి చికిత్స చేయకపోతే ప్రాణాంతకం కావచ్చు.

Tags

Read MoreRead Less
Next Story