RAINS ALERT: గుజరాత్‌లో కుండపోత.. ఢిల్లీలో యమునా డేంజర్‌ బెల్స్‌

RAINS ALERT: గుజరాత్‌లో కుండపోత.. ఢిల్లీలో యమునా డేంజర్‌ బెల్స్‌
దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు... గుజరాత్‌లో వరుణిడి బీభత్సం... ఢిల్లీలో మళ్లీ ప్రమాదస్థాయిని దాటి యుమున ప్రవాహం...

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు‍( Heavy Rain) కురుస్తున్నాయి. పలు చోట్ల వరదలు సంభవించి జనజీవనం అస్తవ్యస్తమైంది. దేశ రాజధాని ఢిల్లీ(delhi)లో యమునా నది మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఢిల్లీవాసులు వణికిపోతున్నారు. కొద్దిరోజులుగా యమునా నదీ(yamuna river) ప్రవాహం తగ్గుముఖం పట్టగా.. బుధవారం ఉదయానికి నీటిమట్టం మళ్లీ ప్రమాదకర స్థాయిని దాటింది.


ఉదయం 8 గంటల సమయానికి ఢిల్లీ పాత రైల్వే వంతెన వద్ద యుమనా నది నీటి మట్టం ప్రమాదకర స్థాయి 205.33 మీటర్లని దాటి 205.48 మీటర్లుగా నమోదైనట్లు కేంద్ర జల కమిషన్ తెలిపింది . ఈ సాయంత్రానికి ఇది 205.72 మీటర్లను చేరే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతవారం యమునా నది నీటిమట్టం ఆల్ టైం గరిష్ఠానికి చేరి 208.66మీటర్లుగా నమోదవడంతో దిల్లీలోని అనేక ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి.


గుజరాత్ లో వర్షాలు( heavy rainfall) దంచికొడుతున్నాయి. రాజ్ కోట్ లోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ధోరాజిలో పెద్ద ఎత్తున వాహనాలు నీట మునిగాయి. రానున్న రెండు మూడు రోజుల్లో గుజరాత్ లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ(India Meteorological Department) అంచనా వేసింది. దీంతో ఆ రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది. గిర్ సోమ్ నాథ్ , కచ్ , నవ్ సరి, వల్సాద్ , అమ్రేలీ, రాజ్ కోట్ జిల్లాల్లో NDRF బలగాలను రంగంలోకి దింపింది. గుజరాత్ లోని కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.


ముంబలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.పాల్ఘర్, రాయ్ గడ్ జిల్లాలకు భారత వాతావరణశాఖ-IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. థానే, ముంబయి, రత్నగిరి ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. అసోంలో దిసాంగ్ డిఖో నదుల నీటిమట్టం భారీగా పెరిగింది. శివసాగర్ లోని పలు ప్రాంతాల్లో వరద పరిస్థితి నెలకొంది.


NDRF, SDRF బృందాలు రంగంలోకి దిగాయి. వరద ప్రభావం ఉన్న ప్రాంతాల్లోని ప్రజల్ని పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఉత్తరాదిలో పలు రాష్ట్రాల్లో మళ్లీ భారీ వర్షాల ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. జులై 22 వరకు ఉత్తరాఖండ్ , హిమాచల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.

Tags

Read MoreRead Less
Next Story