School Teacher Shot: లంచ్ బాక్స్‌లో తుపాకీ తీసుకొచ్చి టీచర్‌పై కాల్పులు

School Teacher Shot: లంచ్ బాక్స్‌లో తుపాకీ తీసుకొచ్చి టీచర్‌పై కాల్పులు
X
క్లాస్ రూమ్ లో చెంపదెబ్బ కొట్టాడని..

చెంపదెబ్బ కొట్టిన ఉపాధ్యాయుడిపై ఓ విద్యార్థి తుపాకీతో కాల్పులు జరిపిన ఘటన బుధవారం ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌ సింగ్‌ నగర్‌ జిల్లాలో జరిగింది. గురువులు దండించేది విద్యార్థులు సన్మార్గంలో నడవాలని, భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని. కానీ నేటి రోజుల్లో విద్యార్థులు టీచర్లపై దాడులకు పాల్పడుతున్నారు. ఏకంగా గన్ తీసుకొచ్చి మరీ కాలుస్తున్నారు. తాజాగా ఉత్తరాఖండ్‌లోని ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ విద్యార్థి క్లాస్ రూమ్ లో తనను చెంపదెబ్బ కొట్టాడని గన్ తీసుకొచ్చి టీచర్ పై కాల్పులు జరిపాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ ప్రైవేట్ పాఠశాలలో గంగాన్‌దీప్ సింగ్ కోహ్లీ అనే ఉపాధ్యాయుడు భౌతికశాస్త్రం బోధిస్తున్నాడు.

ఈ వారం ప్రారంభంలో, అతను తన విద్యార్థులలో ఒకరైన సమరత్ బజ్వా ను చెంపదెబ్బ కొట్టాడు. దీంతో టీచర్ పై కక్ష పెంచుకున్న విద్యార్థి తన టిఫిన్ బాక్స్‌లో తుపాకీని ప్యాక్ చేసి, తరగతి గదిలోకి తీసుకెళ్లాడు. మధ్యాహ్నం విరామం తర్వాత, టీచర్ కోహ్లీ తరగతి గది నుంచి బయటకు వెళుతుండగా బాలుడు తన టిఫిన్ బాక్స్ నుంచి గన్ తీసి ఉపాధ్యాయుడిపై కాల్పులు జరిపాడు. ఆ ఉపాధ్యాయుడికి బుల్లెట్ వీపు లోకి దూసుకెళ్లింది. విద్యార్థి పారిపోవడానికి ప్రయత్నించాడు, కానీ ఇతర ఉపాధ్యాయులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

గాయపడిన టీచర ను వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి బుల్లెట్‌ను విజయవంతంగా తొలగించినట్లు తెలిపారు. మిస్టర్ కోహ్లీ పరిస్థితి స్థిరంగా ఉందని, తదుపరి పర్యవేక్షణ కోసం ఆయనను ఐసియుకు తరలించాలని భావిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. ఆ మైనర్ విద్యార్థిపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 109 కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పిస్టల్‌ను స్వాధీనం చేసుకుని ఆ టీనేజర్ తుపాకీని ఎలా పొందాడనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags

Next Story