PM Narendra Modi: జమ్మూ కశ్మీర్ విద్యార్థులతో ముచ్చటించిన ప్రధాని మోడీ

PM Narendra Modi: జమ్మూ కశ్మీర్ విద్యార్థులతో  ముచ్చటించిన ప్రధాని మోడీ
ప్రధాని మాటలు తమలో స్ఫూర్తిని రగిలించాయంటున్న విద్యార్ధులు

జమ్ముకశ్మీర్‌కు చెందిన విద్యార్థులతో ప్రధాని నరేంద్రమోదీ కాసేపు సంభాషించారు. వతన్‌ కో జానో కార్యక్రమంలో భాగంగా జమ్ముకశ్మీర్‌ విద్యార్థులు దేశంలోని పలు ప్రాంతాలను చుట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలో దిల్లీకి వెళ్లిన ఆ విద్యార్థులతో ప్రధాని మాట్లాడారు. ఈ బృందంలో దాదాపు 250 మంది పిల్లలు ఉన్నారు. వారంతా వెనుకబడిన తరగతులకు చెందిన పేద విద్యార్థులని అధికారిక వర్గాలు తెలిపాయి. వారు ఇప్పటివరకు జైపూర్, అజ్మీర్, దిల్లీలను సందర్శించారని పేర్కొన్నాయి. వతన్‌ కో జానో.. జమ్ముకశ్మీర్‌ పిల్లలకు దేశాన్ని చూపించి పరిస్థితులను అర్థం చేసుకునేలా చేయడానికి ఉద్దేశించిన కార్యక్రమమని అధికారులు చెప్పారు. పిల్లలతో ముచ్చటించిన ప్రధాని వారి పరిస్థితులను తెలుసుకున్నారు. చదువు ఇతర ప్రణాళికలపై ప్రధాని విద్యార్థులకు సూచనలు చేశారు.


‘వతన్ కో జానో’ ( దేశం గురించి తెలుసుకో) కార్యక్రమంలో భాగంగా ఆదివారంప్రధానమంత్రి నరేంద్ర మోడీ జమ్మూ కశ్మీర్ విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. జమ్మూ కశ్మీర్‌లోని అన్ని జిల్లాలనుంచి మొత్తం 250 మంది విద్యా్ర్థులు ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. ఇప్పటికే జైపూర్, అజ్మీర్, ఢిల్లీ ప్రాంతాలను సందర్శించిన వీరు ఆదివారం ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చప్పట్లు కొడుతూ ప్రధానికి సాదర స్వాగతం పలికారు విద్యార్థులు. మోడీతో కలిసి ఫొటోల దిగారు. ఇక మోడీ కూడా విద్యార్థుల అలవాట్లు, అభిరుచులు, లక్ష్యాలు, అలాగే ప్రయాణపు అనుభవాల గురించి అడిగి తెలుసుకున్నారు. వారి కెరీర్‌ పరంగా విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారు. అనంతరం ప్రధాని మోడీ, విద్యార్థులందరూ ఫొటోలు దిగారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా వచ్చి తమను కలవడంతో కశ్మీరీ విద్యార్థులు ఆనందంతో పొంగిపోయారు. తామంతా కశ్మీర్‌ను దాటి వేరే రాష్ట్రాల్లోకి రావడం ఇదే మొదటిసారని, . ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాకే మా ప్రాంతాల్లో చదువుకు ప్రాముఖ్యత పెరిగిందన్నారు. ఇప్పుడు ప్రధాని మోడీనితో కలిసి ఫొటోలు కూడా దిగటం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆయన తమకెంతో విలువైన సలహాలిచ్చారని, ఆయన చెప్పిన మాటలు తమకు ఎంతో స్ఫూర్తినిచ్చాయన్నారు. దేశం కోసం ఏదో ఒకటి చేయాలన్న ఆకాంక్షను పురిగొల్పాయి అంటూ విద్యార్థులు తమ అనుభవాలను పంచుకున్నారు.

Tags

Next Story