వరద నీటిలో ఇరుక్కున్న కాలేజీ బస్

గుజరాత్ ఖేడా జిల్లాలోని నడియాడ్‌లో వర్షం కారణంగా ఒక బస్సు బురదలో ఇరుక్కుపోయింది. ప్రధాన రహదారిలోని అండర్‌పాస్‌లో భారీగా వరదనీరు నిలిచిపోవడం తో బస్సు అటు ఇటు కదలకుండా ఉండిపోయింది. స్పందించిన స్థానికులు బస్సులో ఇరుక్కున్న ఒక్కొక్క విద్యార్థినిని కిటికీల్లోంచి బయటికి లాగారు.
గుజరాత్ లోని నదియార్ ప్రాంతాన్ని ఈ ఉదయం భారీ వర్షం ముంచెత్తింది. కొండపోత వర్షానికి వీధులన్నీ జలమయమయ్యాయి. ఇదే సమయంలో ఓ కాలేజీ బస్సు ఖేడా ప్రాంతంలో నీళ్లలో ఆగిపోయింది. విద్యార్థినులు బస్సు నుంచి కిందకు దిగే అవకాశం లేకుండా పోయింది.
విద్యార్థులు కాసేపు లోపల ఇరుక్కుపోయి బెంబేలెత్తిపోయారు. అయితే అక్కడికి చేరుకున్న స్థానికులు వారికి సహాయం చేశారు. ఎమర్జెన్సీ విండో సహాయంతో విద్యార్థులను బయటకు తీసుకు రాగలిగారు.
గుజరాత్‌లో బిపర్‌జాయ్ తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు నైరుతి రుతుపవనాల ప్రభావం కూడా తోడైయింది. దాంతో ఆ రాష్ట్రంలో వానలకు అడ్డు ఆపు లేకుండా పోయింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నదులు పొంగి పొరలుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com