Uk Sand Master Award: సుదర్శన్‌ పట్నాయక్‌కు యూకే శాండ్‌ మాస్టర్‌ అవార్డ్‌

Uk Sand Master Award: సుదర్శన్‌ పట్నాయక్‌కు యూకే శాండ్‌ మాస్టర్‌ అవార్డ్‌
X
పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయ కళాకారుడు సుదర్శన్‌ పట్నాయక్‌

ప్రపంచ ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఇసుకతో శిల్ప కళను ప్రదర్శించటంలో ఆయన చేసిన కృషికి గాను ‘ద ఫ్రెడ్‌ డారింగ్టన్‌ శాండ్‌ మాస్టర్‌ అవార్డ్‌’ను అందుకున్నారు. శనివారం నైరుతి ఇంగ్లండ్‌లోని వేమౌత్‌లో మొదలైన 2025 ఇంటర్నేషనల్‌ శాండ్‌ ఆర్ట్‌ ఫెస్టివల్‌లో సుదర్శన్‌ పట్నాయక్‌కు నగర మేయర్‌ జాన్‌ ఓరెల్‌ మెడల్‌, అవార్డును అందజేశారు. దీనికంటే ముందు వేడుకలో పాల్గొన్న సుదర్శన్‌ పట్నాయక్‌ ‘ప్రపంచ శాంతి’ అనే సందేశంతో 10 అడుగుల ఎత్తుతో వినాయకుడి సైకత శిల్పాన్ని ఆవిష్కరించారు. ప్రపంచ ప్రఖ్యాత బ్రిటీష్‌ సైకత శిల్పి ఫ్రెడ్‌ డారింగ్టన్‌ పేరుమీదుగా బ్రిటన్‌ ఏటా ఈ పురస్కారాలను అందజేస్తున్నది. ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయ కళాకారుడిగా సుదర్శన్‌ పట్నాయక్‌ రికార్డ్‌సృష్టించారు. ఈసారి బ్రిటన్‌లో జరిగిన స్యాండ్‌ ఫెస్టివల్‌లో అంతర్జాతీయంగా ప్రఖ్యాతి పొందిన 65మంది సైకత శిల్ప కళాకారులు పాల్గొన్నారు.

Tags

Next Story