దేశ రక్షణకు 'సుదర్శన్ చక్ర'.. స్వాతంత్ర దినోత్సవ వేడుకలో పీఎం ప్రకటన

దేశ రక్షణకు సుదర్శన్ చక్ర.. స్వాతంత్ర దినోత్సవ వేడుకలో పీఎం ప్రకటన
X
జాతీయ భద్రతా కవచాన్ని బలోపేతం చేయడానికి భారతదేశం 'సుదర్శన్ చక్ర' అనే మిషన్‌ను ప్రారంభించనుందని ప్రధానమంత్రి ప్రకటించారు.

భారతదేశ 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి పొరుగుదేశమైన పాకిస్తాన్ ను హెచ్చరించారు. ఎర్రకోటపై త్రివర్ణపతాకాన్ని ఎగురవేసిన అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. ఉగ్రవాదులను, వారిని పెంచి పోషిస్తున్న వారిని ఒకేలా చూస్తామని భవిష్యత్తులో ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే భారత సాయుధ దళాలు తగిన బుద్ది చెబుతాయని అన్నారు.

జాతీయ భద్రతా కవచాన్ని విస్తరించడానికి భారతదేశం 'సుదర్శన్ చక్ర' అనే మిషన్‌ను ప్రారంభించనుందని ప్రధాని ప్రకటించారు. రక్షణ తయారీ రంగంలో ముందుకు సాగడం అవసరమని అన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయంపై సాయుధ దళాలను ప్రశంసిస్తూ, పాకిస్తాన్‌కు జరిగిన నష్టాల గురించి ప్రతిరోజూ కొత్త వివరాలు వెలువడుతున్నందున దానికి తీవ్ర దెబ్బ తగిలిందని మోదీ అన్నారు.

పాకిస్తాన్ అణ్వాయుధ బెదిరింపులను భారతదేశం ఇకపై సహించదని మరియు సరిహద్దు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ కొత్త పద్దతి నెలకొల్పిందని ప్రధానమంత్రి మరోసారి స్పష్టం చేశారు.

"ఈ రోజు, ఆపరేషన్ సిందూర్ లో ధైర్యంగా శత్రువులపై పోరాడిన భారత సైనికులకు ఎర్రకోట నుండి సెల్యూట్ చేసే అవకాశం నాకు లభించింది అని అన్నారు.

పహల్గామ్ లో జరిగిన దారుణమైన దాడిని గుర్తుచేసుకుంటూ , దేశం మరియు ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతికి, ఆగ్రహానికి గురయ్యాయని, ఆపరేషన్ సిందూర్ ఆ భావనకు ప్రతిబింబమని ప్రధానమంత్రి అన్నారు.

ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడికి ప్రతిస్పందిస్తూ భారతదేశం సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో సహా అనేక శిక్షాత్మక దౌత్య మరియు ఆర్థిక చర్యలతో స్పందించింది.

పాకిస్తాన్‌తో సింధు జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేయాలనే భారతదేశం నిర్ణయాన్ని మోదీ తన ప్రసంగంలో సమర్థించారు. రక్తం మరియు నీరు కలిసి ప్రవహించవు అని మోడీ అన్నారు.

"భారతదేశం నుండి వచ్చే నదులు శత్రువుల భూములకు సాగునీరు అందిస్తున్నాయి, నా దేశ భూమి నీటి కొరతను ఎదుర్కొంటోంది. గత ఏడు దశాబ్దాలుగా, ఈ ఒప్పందం రైతుల ప్రయోజనాలకు హాని కలిగిస్తోంది" అని ఆయన అన్నారు.

అంతకుముందు, భారత వైమానిక దళానికి చెందిన రెండు Mi-17 హెలికాప్టర్లు ఎర్రకోటపై పూల వర్షం కురిపించాయి. ఒక హెలికాప్టర్ త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించగా, మరొకటి ఆపరేషన్ సిందూర్ బ్యానర్‌ను ప్రదర్శించింది.

Tags

Next Story