Sunny Leone: 'బాలీవుడ్‌లో నేను మాత్రమే అలా ఉన్నాను'.. సన్నీ లియోన్ షాకింగ్ కామెంట్స్..

Sunny Leone (tv5news.in)
Sunny Leone: సన్నీ లియోన్.. కేవలం ఓ గ్లామర్ డాల్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోయిన్. తను కేవలం గ్లామర్ రోల్స్‌కే పరిమితం అనుకున్న వారికి తన నటనను కూడా పరిచయం చేసి ఆశ్చర్యపరిచింది. అంతే కాకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా చోటు దక్కించుకుంది సన్నీ. ప్రస్తుతం స్పెషల్ సాంగ్స్‌తో యూత్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా బాలీవుడ్‌పై సన్నీ చేసిన కామెంట్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.
సన్నీ లియోన్ ఆన్ స్క్రీన్ ఎలా ఉన్నా.. ఆఫ్ స్క్రీన్ మాత్రం చాలామందికి సాయం చేసే గుణం ఉన్న వ్యక్తి. తన వ్యక్తిత్వానికే చాలామంది అభిమానులు అయ్యారు కూడా. ఇటీవల సింగర్ మికా సింగ్‌తో కలిసి సన్నీ.. 'పంగట్' అనే పాట చేసింది. ఈ పాట ప్రమోషన్స్‌లో భాగంగా సన్నీ.. కామెడీ నైట్స్ విత్ కపిల్ షోకు వచ్చింది. అక్కడే సన్నీ ఈ స్టేట్‌మెంట్.
టైమ్ అంటే టైమ్‌కు సెట్స్‌కు వెళ్లే వ్యక్తి బాలీవుడ్‌లో తాను మాత్రమే అని చెప్పింది సన్నీ. కపిల్ శర్మ కూడా దీనికి అంగీకరించాడు. దీంతో ఇతర హీరోహీరోయిన్ల అభిమానులు అంటే ఇంకెవరికీ సెట్స్‌కు టైమ్‌కు రావడం తెలీదా, టైమింగ్ మెయింటేయిన్ చేయడం రాదా అని ఎదురుప్రశ్నలు వేస్తు్న్నారు. ఎంతైనా సన్నీ.. కాస్త స్ట్రెయిట్ ఫార్వడ్‌గా మాట్లాడే వ్యక్తిత్వం ఉన్న నటి కదా..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com