మూఢనమ్మకం! పాము కాటుకు గురైన వ్యక్తి మృతదేహాన్ని రెండు రోజులు గంగా నదిలో ఉంచి..

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో మూఢ నమ్మకాలకు సంబంధించిన ఆశ్చర్యకరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ, ఒక వ్యక్తి మరణించిన తరువాత, అతని కుటుంబ సభ్యులు అతనిని గంగా నది ప్రవాహంలో రెండు రోజుల పాటు ఉంచారు. పాము కాటుకు గురై చనిపోయిన తర్వాత తన కొడుకు మళ్లీ బతికి వస్తాడని అతడి తల్లి ఎంతో నమ్మకం పెట్టుకుంది. కానీ ఒకసారి ప్రాణాలు వదిలిన తరువాత మరల బ్రతుకుతాడనేది కల మాత్రమే అని ఆ తల్లికి తెలియలేదు. గంగా నదిలో మృత దేహం వేలాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అయితే రెండు రోజులుగా మృతదేహాన్ని వేలాడదీసి ఉంచినా అందులో ఎలాంటి చలనం లేదు. రెండు రోజులుగా యువకుడి శరీరంలో కదలిక లేకపోవడంతో బయటకు తీసి దహనం చేశారు. ఈ సంఘటన ఏప్రిల్ 26న జరిగింది. 20 ఏళ్ల మోహిత్ కుమార్‌ను పొలంలో విషపూరిత పాము కాటేసింది.
కుటుంబసభ్యులు మోహిత్‌ను వైద్యుడి వద్దకు తీసుకెళ్లినా పరిస్థితి మెరుగుపడలేదు. ఒకరి సలహా మేరకు స్థానిక చికిత్స కోసం తీసుకెళ్లారు. దీంతో పాము కాటుకు గురైన వ్యక్తి మృతదేహాన్ని ప్రవహించే గంగానదిలో ఉంచితే విషం పోతుందని కొందరు కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు రెండు రోజుల పాటు యువకుడి మృతదేహాన్ని గంగా ప్రవాహంలో కట్టి ఉంచారు.
బయటకు వచ్చిన వీడియోలో, వ్యక్తి మృతదేహం గంగా ప్రవాహంలో వేలాడుతోంది. పెద్ద సంఖ్యలో జనం గుమిగూడి ఈ దృశ్యాన్ని వీక్షిస్తున్నారు. అయితే నెటిజన్లు మాత్రం అదంతా మూఢనమ్మకం అంటూ పాము కాటుకు గురైతే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లాలని సూచిస్తున్నారు.
अंधविश्वास!
— Avinash Tiwari (@TaviJournalist) May 2, 2024
मामला उत्तर प्रदेश के बुलंदशहर का है। यहां एक शख्स की सांप के काटने से मौत हो गई, इसके बाद शख्स की जान बचाने की उम्मीद में परिवार वाले शव को गंगा में लटकाए रखे थे। #बुलंदशहर pic.twitter.com/PTWoQwhMQz
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com