Supreme Court: బెంగాల్ టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే

పశ్చిమ బెంగాల్‌లో 25వేల 7వందల 53ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర నియామకాలను రద్దు చేస్తూ కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ JBపర్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. దర్యాప్తు కొనసాగించాలని CBIకి సూచించిన సుప్రీంకోర్టు...కేబినెట్ మంత్రులపై కూడా విచారణ చేయాలని పేర్కొంది. అయితే విచారణ సమయంలో అనుమానితులను అరెస్ట్ చేయొద్దని కోరింది.
2016లో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకం కోసం బెంగాల్ సర్కారు రాష్ట్రస్థాయి పరీక్ష నిర్వహించింది. 24,650ఖాళీల భర్తీ కోసం చేపట్టిన నియామకాల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావటంతో ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది. ఈ కేసు పెండింగ్‌లో ఉండగానే...బెంగాల్ ప్రభుత్వం నియామకాలు చేపట్టింది. ఖాళీల సంఖ్య కంటే ఎక్కువ మందికి అపాయింట్‌మెంటు లెటర్లు ఇవ్వటం వివాదాస్పదమైంది. దీంతో కోల్‌కతా హైకోర్టు ఈ నియామకాలను రద్దు చేస్తూ కోల్‌కతా హైకోర్టు తీర్పునిచ్చింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. బెంగాల్‌లో 2016 నాటి స్టేట్ లెవల్ సెలక్షన్ టెస్ట్ (SLST) నియామక ప్రక్రియ చెల్లదని ఇటీవల కలకత్తా హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ క్రమంలోనే 25,743 మంది టీచర్లు, నాన్‌టీచింగ్ సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది.
ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో 9 నుంచి 12 తరగతులకు ఉపాధ్యాయులతో పాటు గ్రూప్ సి, గ్రూప్ డి స్టాఫ్ సిబ్బంది నియామకాల కోసం 2016లో బెంగాల్ సర్కారు రాష్ట్రస్థాయి సెలక్షన్ పరీక్ష నిర్వహించింది. 24,650 ఖాళీల భర్తీ కోసం చేపట్టిన ఈ రిక్రూట్‌మెంట్ పరీక్షకు 23 లక్షల మందికి పైగా హాజరయ్యారు. ఇందులో అవకతవకలు జరిగినట్లు అప్పట్లోనే ఆరోపణలు రాగా.. ఈ వ్యవహారం కోర్టుకు చేరింది. ఆ అంశం పెండింగ్‌లో ఉండగానే.. ఇందులో ఎంపిక ప్రక్రియను చేపట్టి 25,753 మందికి అపాయింట్‌మెంట్ లెటర్లు అందజేశారు. ఖాళీల కంటే అదనంగా కొంతమందిని నియమించడంపై వివాదాస్పదమైంది. ఈ క్రమంలోనే నాటి నియామక ప్రక్రియను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. తాజాగా మంగళవారం హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com