విద్యుత్ బకాయిలపై సుప్రీం కీలక తీర్పు

విద్యుత్ బకాయిలపై సుప్రీం కీలక తీర్పు
పాత కరెంట్ బకాయిలను కొత్త యజమాని నుంచి వసూలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది

విద్యుత్ బకాయిలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పాత కరెంట్ బకాయిలను కొత్త యజమాని నుంచి వసూలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. కేరళకు చెందిన 19 మంది పిటిషన్ దాఖలు చేశారు. పాత ఓనర్స్ బిల్లులు కట్టలేదన్న కారణంతో తమ ఇంటి పరిసరాలకు విద్యుత్ నిలిపివేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఏదైనా ఒక ప్రాంగణం నుంచి రావాల్సిన కరెంట్ బకాయిలను దాన్ని కొత్తగా కొనుగోలు చేసిన వారి నుంచి వసూలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story